Asia Cup 2022: భారత్ జోరు కొనసాగేనా..! నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ.. వారు రాణిస్తే భారత్‌ విజయం సునాయాసం ..

ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4 దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్‌తో భారత్ జట్టు తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. మరోసారి దాయాది జట్ల పోరును తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.

Asia Cup 2022: ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4 దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్‌తో భారత్ జట్టు తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరుగా భారత్ విజయం సాధించింది. అదే జోరును నేడు జరిగే మ్యాచ్ లో కొనసాగించేందుకు భారత్ జట్టు సన్నద్ధమవుతోంది. అయితే టీమిండియాకు ఆల్ రౌండర్, స్పిన్నర్ జడేజా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవటం కొంత ఇబ్బందికరమే అయినప్పటికీ.. ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తే పాక్ పై విజయం నల్లేరుపై నడకగా మారుతుంది.

India vs pakistan match in asia cup-2022: ఇండియా – పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీ

పాకిస్థాన్ జట్టుపై గ్రూప్ దశలో విజయం సాధించిన టీమిండియాకు నేడు జరిగే మ్యాచ్ అంతతేలిగ్గా ఉండకపోవచ్చు. ఇప్పటికే ఓ ఓటమితో ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ జట్టు ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. వారిని దీటుగా ఎదుర్కోవాలంటే భారత్ బ్యాట్స్ మెన్ రాణించాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్ లలో భారత్ బ్యాటింగ్ అంత సంతృప్తిగా లేదనే చెప్పొచ్చు. ఓపెనింగ్ భాగస్వామ్యం విఫలమవుతోంది. రాహుల్ ఓపెనర్ గా విఫలమవుతున్నాడు. కోహ్లీ చెప్పుకోదగ్గ పరుగులు చేసినప్పటికీ గతంలోలా పూర్తిస్థాయిలో ఆటను ఆశ్వాదించలేక పోతున్నట్లు మాజీలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సూర్యకుమార్ అదేజోరును కొనసాగిస్తే పాక్ ఓటమి ఖాయమనే చెప్పొచ్చు.

Asia Cup 2022 Ind Vs Pak : వాటే మ్యాచ్.. పాకిస్తాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్రతీకారం తీర్చుకుంది

బౌలింగ్ విభాగంలో గత రెండు మ్యాచ్ లలో టీమిండియా రాణించినప్పటికీ.. కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం జడేజా టోర్నీ నుంచి తప్పుకోవటం టీమిండియాకు కొంత ఇబ్బందికర విషయమే. అతడి స్థానంలో దీపక్ హుడా, అశ్విన్ లు పోటీపడుతున్నారు. బ్యాటింగ్ ప్రధానమనుకుంటే హుడాకు, బౌలింగే ముఖ్యమనుకుంటే అశ్విన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఆసియా కప్ లో టాస్ గెలిచిన జట్లు ఎక్కువగా మొదటి బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. అలా చేసిన జట్లే ఎక్కువగా విజయాలుసైతం సాధించాయి. దుబాయ్ పిచ్ బౌలర్లకే ఎక్కువగా అనుకూలం. స్పిన్నర్లకు ఈ పిచ్ నుంచి మంచి సహకారం అందుతుంది.

ట్రెండింగ్ వార్తలు