APL : స‌న్‌రైజ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్‌కి ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్‌లో అత్య‌ధిక ధ‌ర‌

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రుపున అద‌ర‌గొడుతున్నాడు ఆల్‌రౌండ‌ర్‌ నితీశ్ కుమార్ రెడ్డి.

Andhra Premier League : ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రుపున అద‌ర‌గొడుతున్నాడు ఆల్‌రౌండ‌ర్‌ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్ర‌మంలో ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్‌లో ఈ ఆట‌గాడు రికార్డు ధ‌ర ప‌లికాడు. మూడో సీజ‌న్ కోసం వేలం నిర్వ‌హించ‌గా ఏకంగా 15.6 ల‌క్ష‌ల మొత్తాన్ని కొల్ల‌గొట్టాడు. ఐపీఎల్‌లో రాణిస్తుండ‌డంతో అత‌డి సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. ఆఖ‌రికి గోదావ‌రి టైటాన్స్ అత‌డిని రికార్డు ధ‌ర‌కు సొంతం చేసుకుంది.


ఈ క్ర‌మంలో ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ప్లేయ‌ర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి రికార్డుల‌కు ఎక్కాడు. వేలాన్ని వీక్షించిన నితీశ్ తాను అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డంతో అత‌డి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. హోట‌ల్ గదిలో ఉన్న అత‌డు స‌హ‌చ‌రుల‌తో త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

IPL 2024 : వ‌ర్షం వ‌ల్ల స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ మ్యాచ్ ర‌ద్దైతే.. ఆర్‌సీబీ, సీఎస్‌కేల ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌పై ప్ర‌భావ‌మెంత‌?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు ముందు నిర్వ‌హించిన వేలంలో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ నితీశ్ ను బేస్‌ప్రైజ్ రూ.20ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకుంది. మ‌యాంక్ అగ‌ర్వాల్ గాయ‌ప‌డ‌డంతో తుది జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్న నితీశ్ వ‌చ్చిన అవ‌కాశాల‌ను చాలా చ‌క్క‌గా వినియోగించుకున్నాడు. 9 మ్యాచుల్లో 150 స్ట్రైక్‌రేటుతో 239 ప‌రుగులు చేశాడు. 3 వికెట్లు తీశాడు.

ట్రెండింగ్ వార్తలు