India vs West Indies T20: ఈరోజు కూడా ఆలస్యంగానే.. అధికారికంగా వెల్లడించిన విండీస్ క్రికెట్ బోర్డు

భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.

India vs West Indies T20: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. జరిగిన రెండు మ్యాచ్‌లలో చెరొకటి గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచాయి. మూడవ టీ20 ఇరు జట్లకు కీలకంగా మారింది. సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ మైదానంలో నేటి మ్యాచ్ జరగనుంది. సోమవారం మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 8గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ రాత్రి 11గంటల ప్రారంభమైంది. ఈ రోజు కూడా మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగదని, ఆలస్యమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

India vs West Indies T20: రెండో టీ20లో టీమిండియా ఓటమి.. మెకాయ్ దాటికి చేతులెత్తేసిన భారత్ బ్యాట్స్‌మెన్

సోమవారం రాత్రి సెయింట్ కిట్స్ లోని వార్నర్ పార్క్ మైదానంలో  2వ టీ20 మ్యాచ్ జరిగింది. అదే గ్రౌండ్‌లో 3వ టీ20 మ్యాచ్ మంగళవారం సాయంత్రం జరగనుంది. లగేజీ రావడం ఆలస్యం కావడంతో సోమవారం రాత్రి 8గంటలకు జరగాల్సిన మ్యాచ్ 11గంటలకు ప్రారంభమైంది. ఆ సమయానికి కూడా అందరి ఆటగాళ్ల కిట్లు రాకపోవడంతో అర్ష్‌దీప్ జెర్సీ వేసుకొని సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు రావడం కనిపించింది.

Virat Kohli: ఆసియాకప్‌పైనే కోహ్లీ ఆశలు.. ఎంపిక చేయకపోవచ్చన్న పాక్ మాజీ క్రికెటర్

ఈ రోజు జరిగే మ్యాచ్ కూడా ఆలస్యం అవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని తెలింది. ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు మాట్లాడుతూ.. సోమవారం రాత్రి మ్యాచ్ ఆలస్యంగా జరగడంతో నేడు జరిగే మ్యాచ్ కు కావాల్సిన విశ్రాంతిని ఇస్తామని చెప్పడంతో ఇరు జట్లు టీ20 మ్యాచ్ ఆడేందుకు ఒపుకున్నాయని, అందుకే గంటన్నర ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు