New Gmail Design : జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. కొత్త జీమెయిల్ డిజైన్ తప్పక వాడాల్సిందే.. ఇకపై పాత డిజైన్‌కు మారలేరు..!

New Gmail Design : జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ నుంచి Google కొత్త Gmail యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి వచ్చేస్తోంది. జీమెయిల్ వినియోగదారులందరూ కొత్త జీమెయిల్ డిజైన్ తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.

New Gmail Design : జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ నుంచి Google కొత్త Gmail యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి వచ్చేస్తోంది. జీమెయిల్ వినియోగదారులందరూ కొత్త జీమెయిల్ డిజైన్ తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. Gmail, Google Meet, Google Chat, Spaces వంటి Google అప్లికేషన్‌లను అన్ని ఒకే చోటకు తీసుకొస్తోంది. Gmail కోసం ఇంటిగ్రేటెడ్ వ్యూను అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఈమెయిల్ సర్వీసు కోసం కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టింది. కొత్త UI అన్ని విభిన్న యాప్‌లలో సులభంగా యాక్సెస్‌ని పొందవచ్చు. Google ఇప్పటికీ పాత డిజైన్‌కి తిరిగి రావడానికి ఒక ఆప్షన్ ఇచ్చింది. అయితే త్వరలో, యూజర్లు Gmail పాత డిజైన్‌కు తిరిగి మారే అవకాశం ఉండదు.

New Gmail design now mandatory for all, user can’t switch back to old interface

ఈ నెల నుంచి యూజర్ ఇంటర్‌ఫేస్ Gmail ప్రామాణిక ఎక్స్ పీరియన్స్ మారుతుంది. ఒరిజినల్ వ్యూకు తిరిగి వచ్చే అవకాశం లేదు. కొత్త UIతో యూజర్లు ఇప్పటికీ వారి Gmail థీమ్, ఇన్‌బాక్స్ టైప్, మరిన్నింటిని మార్చుకోవచ్చు. క్విక్ సెట్టింగ్‌లు.. గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. కొత్త UI Gmail డిఫాల్ట్ డిజైన్‌గా మారడంతో.. విండోకు ఎడమ వైపున Gmail, Chat, Spaces, Meetతో కూడిన ఇంటిగ్రేటెడ్ వ్యూ చాట్‌ని ఆన్ చేసిన Gmail యూజర్లకు కూడా ప్రామాణికంగా మారుతుంది. క్విక్ సెట్టింగ్‌లు ఉన్నప్పటికీ సైడ్ ప్యానెల్‌ను ఆప్షన్ Google అందిస్తుంది. క్విక్ యాక్సస్ కోసం యూజర్లు డిఫాల్ట్ యాప్‌లను తొలగించవచ్చు. ముఖ్యమైన యాప్‌లను యాడ్ చేయవచ్చు.

New Gmail design now mandatory for all, user can’t switch back to old interface

Gmail కొత్త UI కొంచెం వివరిస్తూ.. Gmailలోని క్విక్ సెట్టింగ్‌లను ఉపయోగించి యూజర్లు విండో ఎడమ వైపున టోగుల్ చేసేందుకు ఇష్టపడే యాప్‌ల మధ్య ఎంచుకోవచ్చని Google పేర్కొంది. యూజర్లు సిస్టమ్ లేబుల్‌ల కోసం స్పెషల్ సెక్షన్ (స్టార్ ఉంచినవి) తాత్కాలికంగా నిలిచిపోయినవి. ఒక ఆప్షన్ కూడా చూస్తారు. చాట్ చేసేందుకు ఇష్టపడే యూజర్లు ఫుల్ మెసేజ్ ఓపెన్ చేసేందుకు బదులుగా వేగంగా జీమెయిల్ ఆప్షన్లతో పాటు ఇన్‌కమింగ్ మెసేజ్‌లతో స్నిప్పెట్‌లతో బబుల్‌లను చూస్తారు. డిఫాల్ట్‌గా, సైడ్ ప్యానెల్‌లో Google Gmail, Chat, Spaces, Meet చూపిస్తోంది. కొత్త డిజైన్‌లో Gmail ఎడమ వైపున చాట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. యూజర్లు ఇకపై Gmail కుడి వైపున చాట్‌ని కాన్ఫిగర్ చేసే ఆప్షన్ కలిగి ఉండరు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone Secret Button : ప్రతి ఐఫోన్‌లోనూ ఒక సీక్రెట్ బటన్ ఉందని తెలుసా? ఆ బటన్ ఎక్కడ? ఎలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు