Clonal Jamoil Nursery : క్లోనింగ్ విధానంలో జామాయిల్  నర్సరీ – అధిక ఆదాయం పొందుతున్న రైతు  

ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు క్లోనల్ నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు..

Clonal Jamoil Nursery : కాలం మారుతుంది..  పంటల సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా తోటల పెట్టే రైతులు ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలలో నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు అందిస్తున్నారు. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలు అయ్యాయి. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు క్లోనల్ నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు..

ఏ పంట అభివృద్ది అయినా నాణ్యమైన నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది. నారు మొక్కల ఎంపికలో ఏదైనా తప్పు జరిగితే, తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులు తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం, పండ్లతోటలకు ఆశించినంత దిగుబడిరాక పోవడానికి బలమైన కారణాలు.

ఇది దృష్టిలో పెట్టుకోనే పండ్లతోటలను సాగుచేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆదారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రతిచోట నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా, రైతులకు కావల్సిన  మొక్కలను అభివృద్ది చేసి అందిస్తున్నాయి. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, మిట్టగూడెం గ్రామానికి చెందిన యువరైతు అబ్దుల్ పరహన్ క్లోనల్ జామాయిల్ నర్సరీ మొక్కలను తయారు చేస్తున్నారు.

క్లోనల్ సాంకేతికత ద్వారా మొక్కలు ఉత్పత్తి చేసే నర్సరీలు కుక్కునూరు మండలంలో అధికం. బంజరగూడెం నుంచి వేలేరు వరకూ దాదాపు 8 కిలో మీటర్ల మేర ఇతర పంటలేవీ కనిపించవు. ఎటుచూసినా క్లోనల్ నర్సరీలకు చెందిన ఛాంబర్లు దర్శనమిస్తాయి. ఈ మండలంలో దాదాపు 1200 నర్సరీల వరకు ఉన్నాయి.

ఇందులో అబ్దుల్ పరహన్ ది కూడా ఒకటి. డిగ్రీ చదువుకుంటూనే నర్సరీ నిర్వాహణ చూసుకుంటున్నారు. జామాయిల్ మొక్కలు  413, 271  రకాల నుండి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామాయిల్ మొక్కలుగా తయారు చేస్తున్నారు. తయారు చేసిన మొక్కలను ఐటీసీ తోపాటు ఆర్డర్లపై ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తనతో పాటు మరికొంత మందికి ఉపాధిని కల్పిస్తున్నారు.

Read Also : Cultivation of Fruits : ఐదంచెల విధానంలో మిశ్రమ పండ్ల తోటల సాగు

ట్రెండింగ్ వార్తలు