Sesame Kharif Season : ఖరీఫ్‌కు అనువైన నువ్వు రకాలు – అధిక దిగుబడికి చేపట్టాల్సిన యాజమాన్యం 

తక్కువ సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు.

Sesame Kharif Season : ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమ రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. గత ఐదేళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతుండటంతో ఏటేటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. . అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు  ప్రధాన శాస్త్రవేత్త భార్గవి.

Read Also : Cultivation of Fruits : ఐదంచెల విధానంలో మిశ్రమ పండ్ల తోటల సాగు

నూనెగింజల పంటలలో నువ్వులు ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కువ సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు.

అయితే సాగునీటి సౌకర్యం అంతగా లేని అనంతపురం జిల్లాకు ఈ పంటసాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమవుతుంది. అయితే కోస్తా జిల్లాలలో ఎర్లీ ఖరీఫ్ గా మే 15 నుండి మే చివరి వరకు వేస్తుండగా, రాయలసీమ ప్రాంతంలో మాత్రం మే నుండి జూన్ వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఆయా ప్రాంతాలకు అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగులో యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. భార్గవి.

Read Also : Clonal Jamoil Nursery : క్లోనింగ్ విధానంలో జామాయిల్  నర్సరీ – అధిక ఆదాయం పొందుతున్న రైతు  

ట్రెండింగ్ వార్తలు