Sanju Samson : రాహుల్ ద్రవిడ్‌తో శ్రీశాంత్ చెప్పిన అబద్దం.. సంజూ శాంసన్ కెరీర్‌ను మార్చేసిందా?
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సంజు వరల్డ్ కప్‌కు ఎంపిక అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 6, 2024 / 03:41 PM IST
How a lie from Sreesanth changed Sanju Samsons career
Sanju Samson – Sanju Samson : వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024కు ప్రకటించిన భారత జట్టులో సంజు శాంసన్‌కు చోటు దక్కింది. అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం టీమ్ఇండియా తరుపున అరంగ్రేటం చేసినప్పటికి అతడికి ఎక్కువగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సంజు వరల్డ్ కప్‌కు ఎంపిక అయ్యాడు.
కాగా.. ప్రస్తుతం శాంసన్‌కు సంబంధించిన ఓ పాత వీడియో నెటింట్ట వైరల్‌గా మారింది. ఇందులో శాంసన్ తన ఐపీఎల్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో అనే విషయాన్ని చెప్పాడు. తన గురించి మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రస్తుత టీమ్ఇండియా కోచ్, రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కు అబద్ధం చెప్పాడని తెలిపాడు. దీని కారణంగా మొదట ఆర్ఆర్ జట్టులో చోటు దక్కించుకున్న సంజు ఆ తరువాత టీమ్ఇండియా తరుపున అరంగ్రేటం చేశాడు.
Preity Zinta : తొలి బంతికి ధోని క్లీన్‌బౌల్డ్.. వామ్మో ప్రీతి జింటా ఇలా చేస్తుందనుకోలేదు!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 2012లో సంజూ శాంసన్‌ను దక్కించుకుంది. అయితే.. ఆ ఏడాది అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సంజు కెరీర్‌ను మలుపు తిప్పినట్లు శాంసన్ చెప్పాడు. ఆ సమయంలో రాజస్థాన్‌కు ద్రవిడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓ హోటల్లోని లాబీలో రాహుల్‌ను శ్రీశాంత్ కలిశాడు. ఆ సమయంలో నన్ను ద్రవిడ్ కు చూపించాడు శ్రీశాంత్. ఇతను సంజు శాంసన్. మంచి బ్యాటర్. కేరళకు చెందిన ఈ కుర్రాడు స్థానిక టోర్నమెంట్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. అతడికి మనం ఓ ట్రయిల్‌ను నిర్వహించాలని ద్రవిడ్‌తో శ్రీశాంత్ చెప్పాడు.
ఇందుకు ద్రవిడ్ సానుకూలంగా స్పందించాడని అన్నాడు. అతడిని ట్రయిల్స్‌కు తీసుకురావాలని చెప్పాడు. అతడికి ఓ ఛాన్స్ ఇద్దాం అని ద్రవిడ్ చెప్పినట్లు శాంసన్ గుర్తు చేసుకున్నాడు. అయితే.. తాను ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదింది అబద్దం అని శాంసన్ తెలిపాడు.
RCB : ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జరగాల్సిందే
కాగా.. 2012 సీజన్ అనంతరం కోల్‌కతా శాంసన్‌ను విడుదల చేసింది. రాజస్థాన్ రాజస్థాన్ 2013లో సంజూ శాంసన్‌ను కొనుగోలు చేసింది. అతడికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది. జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగిన సంజూ ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్లో శాంసన్ నాయకత్వంలోనే రాజస్థాన్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఎనిమిది మ్యాచుల్లో గెలిచింది. 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా.. సంజూ 10 ఇన్నింగ్స్‌ల్లో 64 సగటుతో 385 పరుగులు చేశాడు.
Dinesh Karthik : కాఫీ కూడా తాగనివ్వలేదురా అయ్యా.. ఆర్సీబీ వికెట్ల పతనం పై దినేశ్ కార్తీక్
