OnePlus Nord Watch : వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ఫీచర్లు లీక్.. అన్ని హెల్త్ ఫీచర్లే.. మహిళల కోసం స్పెషల్ ఫీచర్ ఉందట..!

OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి OnePlus Nord వాచ్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ OnePlus ధృవీకరించింది. అధికారిక ప్రకటనకు ముందు.. రాబోయే స్మార్ట్‌వాచ్ రెండర్‌లు స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి OnePlus Nord వాచ్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ OnePlus ధృవీకరించింది. అధికారిక ప్రకటనకు ముందు.. రాబోయే స్మార్ట్‌వాచ్ రెండర్‌లు స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

ఈ రెండర్‌ల ప్రకారం.. వాచ్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని చెప్పవచ్చు. నావిగేషన్ సైడ్-మౌంటెడ్ బటన్‌తో దీర్ఘచతురస్రాకార డయల్‌ను ఇండికేట్ చేస్తాయి. OnePlus Nord Watch 500 nits గరిష్టంగా 368×448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలిపింది.

టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం.. OnePlus Nord వాచ్ రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లను లీక్ అయ్యాయి. ఈ వేరబుల్ గాడ్జెట్లలో బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో రావచ్చని రెండర్‌లు సూచిస్తున్నాయి. UI ద్వారా నావిగేషన్ సైడ్-మౌంటెడ్ బటన్‌తో సూచించేలా ఉంది. రెండర్‌లు హార్ట్ రేట్ ట్రాకింగ్, మల్టీ ఫిట్‌నెస్ మోడల్‌లకు సపోర్టుతో సహా కొన్ని ఫీచర్లను సూచిస్తున్నాయి.

OnePlus Nord Watch specifications leaked online What to expect

లీక్‌ల ప్రకారం.. OnePlus Nord వాచ్ IP68 బిల్డ్‌ని కలిగి ఉంటుంది. Android, iOS డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ ( SpO2 ) మానిటర్, 24-గంటల హార్ట్ రేట్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటర్, వుమెన్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుందని పేర్కొంది. స్మార్ట్ వాచ్ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందించగలదు.

అంతేకాదు.. OnePlus Nord వాచ్ బ్యాటరీ ఛార్జ్‌పై గరిష్టంగా 10 రోజుల బ్యాటరీని, గరిష్టంగా 30 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందించగలదు. OnePlus నుంచి స్మార్ట్‌వాచ్ 105 వరకు ఫిట్‌నెస్ మోడళ్లను ఆఫర్ చేస్తుందని భావిస్తున్నారు. బ్లూటూత్ v5.2 కనెక్టివిటీని కలిగి ఉంటుందని, N Health యాప్‌తో అనుకూలంగా ఉంటుందని తెలిపింది.

రాబోయే వేరబుల్ డిస్‌ప్లే 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 368×448 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని చైనీస్ టెక్ కంపెనీ ధృవీకరించింది. అదనంగా, భారత్‌లో OnePlus Nord వాచ్ ధర సుమారు రూ. 5వేలు ఉండవచ్చని తెలిపింది. సర్కిల్, దీర్ఘచతురస్రాకార డయల్స్‌తో మల్టీ మోడల్‌లు, వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : OnePlus Festival Sale Offers : OnePlus స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు