Reliance Jio Plans : రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు.. రోజూ 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్..!

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త డేటా బెనిఫిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డేటా ప్లాన్ ప్యాక్ ద్వారా మీరు ఏదైనా ప్యాక్ మధ్యలో డెయిలీ డేటా లిమిట్ దాటితే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త డేటా బెనిఫిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డేటా ప్లాన్ ప్యాక్ ద్వారా మీరు ఏదైనా ప్యాక్ మధ్యలో డెయిలీ డేటా లిమిట్ దాటితే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్లాన్‌లో డేటా లిమిట్ దాటకుండా ఉండేందుకు వీలుగా హైస్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోవచ్చు.

కస్టమర్ల కోసం కొన్ని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 2GB డెయిలీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, Jio క్లౌడ్, Jio సెక్యూరిటీ సహా అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 2GB డేటా, ఎక్స్‌ట్రాక్ట్ బెనిఫిట్స్ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి పరిశీలిద్దాం..

Reliance Jio Plans : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే :

రూ. 249 ప్లాన్ : ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 46GB డేటాను అందిస్తోంది. ఇక పోస్ట్-డైలీ డేటా 64 Kbpsను పొందవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది.

రూ. 299 ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటాను అందించే బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌గా చెప్పవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, ఇతర వాటితో సహా Jio యాప్‌లకు సభ్యత్వాన్ని పొందవచ్చు.

రూ. 533 ప్లాన్ : 56 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో మొత్తం 112GBతో పొందవచ్చు. ఈ ప్లాన్ రోజుకు 2 GB డేటాను పొందవచ్చు. అదనంగా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurityతో పాటు Jio యాప్‌లకు సభ్యత్వాన్ని పొందవచ్చు.

Reliance Jio plans with 2GB data per day and unlimited calls: Check the full list

రూ. 719 ప్లాన్ : రోజుకు 2GB డేటాను అందించే ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు 168GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు. యూజర్లు నెలకు కేవలం రూ. 240తో అదనపు బెనిఫిట్స్ 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurityతో పాటు Jio యాప్‌లకు మెంబర్ షిప్ పొందవచ్చు.

రూ. 799 ప్లాన్ : 56 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటాను పొందవచ్చు. కస్టమర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెర్చ్ చేయడానికి కంటెంట్ వీక్షించడానికి 112GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ కింద ప్యాక్ వ్యాలిడిటీతో ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఇతర బెనిఫిట్స్ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS, JioTV, JioCinema, JioSecurity ఇతర వాటితో సహా Jio యాప్‌లకు సభ్యత్వాన్ని పొందవచ్చు.

రూ. 1,066 ప్లాన్ : 84 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో పాటు ఈ ప్లాన్ డేటా లిమిట్ 2BG చొప్పున 173GB డేటాను పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ ద్వారా 499 విలువైన ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీపై అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

రూ. 2879 ప్లాన్ : 2GB రోజువారీ డేటాను అందించే Jio అత్యంత ఖరీదైన ప్లాన్.. దీనిపై 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 730GB మొత్తం డేటాను అందించే ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, ఇతర వాటితో సహా Jio యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ప్రతి నెలా ఫోన్‌ని రీఛార్జ్ చేయడం లేదా ప్యాక్ వ్యాలిడిటీని పొందేలా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Jio Phone 5G : రిలయన్స్ జియో ఫోన్ 5G వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు