WhatsApp Edit Button : ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌లో ఎడిట్ బటన్ వస్తోంది.. పంపిన మెసేజ్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు!

WhatsApp Edit Button : WhatsApp మెసేజ్‌ల కోసం ఎడిట్ బటన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించింది. ప్లాట్‌ఫారమ్ అనుకున్న విధంగా పని చేస్తే.. స్టేబుల్ వెర్షన్‌కు కూడా అతి త్వరలో ప్రవేశపెట్టవచ్చునని సూచిస్తుంది.

WhatsApp Edit Button : WhatsApp మెసేజ్‌ల కోసం ఎడిట్ బటన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించింది. ప్లాట్‌ఫారమ్ అనుకున్న విధంగా పని చేస్తే.. స్టేబుల్ వెర్షన్‌కు కూడా అతి త్వరలో ప్రవేశపెట్టవచ్చునని సూచిస్తుంది. WaBetaInfo ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. పంపిన వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేస్తే.. దానికి సంబంధించి యూజర్లకు తెలిసేలా యాప్ ప్రతి మెసేజ్ బాక్స్‌లో “Edited” లేబుల్‌ను కనిపించేలా చేస్తుంది.

ప్రస్తుతానికి, వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేస్తే వార్నింగ్ పంపుతుందా లేదా అనే దానిపై సమాచారం లేదు. మెసేజింగ్ యాప్ ఎడిట్ చేసిన మెసేజ్ సమయం లేదా తేదీని చూపుతుందా అనేది కూడా అస్పష్టంగా ఉంది. ఒక మెసేజ్ ఎడిట్ చేయడానికి ప్లాట్‌ఫారమ్ యూజర్లకు కేవలం 15 నిమిషాల సమయాన్ని మాత్రమే ఇస్తుందని నివేదిక పేర్కొంది. ఇది లోపాలను ఎడిట్ చేసేందుకు మొత్తం మెసేజ్ మార్చకుండా యూజర్లకు ఈ ఆప్షన్ అందించనుంది.

ఎడిట్ బటన్‌ను ప్రవేశపెట్టడంతో విశ్వసనీయతకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్ అన్ని ఎడిట్ చేసిన వెర్షన్లను చెక్ చేసే ఆప్షన్ కూడా అందిస్తుందో లేదో తెలియదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి.. స్టేబుల్ వెర్షన్ కోసం ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై సమాచారం లేదు. Android కోసం 2.22.22.14 బీటా అప్‌డేట్ వెర్షన్‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం, ఏదైనా లోపం కనిపిస్తే.. మెసేజ్‌లను డిలీట్ చేసి.. ఆపై వాటిని మళ్లీ రాసేందుకు మాత్రమే వ్యక్తులు ఆప్షన్ కలిగి ఉన్నారు.

WhatsApp is testing edit button for Android, here are the details

కానీ, సమస్య ఏమిటంటే.. యాప్ ట్యాగ్‌ని చూపిస్తుంది. ఈ మెసేజ్ డిలీట్ అయినట్టు సూచిస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా అవతలి వ్యక్తికి ఆ మెసేజ్ ఏమై ఉంటుందనే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇదే విధానాన్ని తీసుకొచ్చాయి. మైక్రో-బ్లాగింగ్ సైట్ ఎడిట్ బటన్ (Edit Button) ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది.

ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ అందుబాటులో ఉంది. ప్లాట్‌ఫారమ్ ఇటీవల ట్వీట్‌ను ఎడిట్ చేసేందుకు ఐదు అవకాశాలను మాత్రమే ఇస్తుందని ప్రకటించింది. వాట్సాప్ వినియోగదారులకు ఇస్తున్న దానికంటే చాలా ఎక్కువగానే చెప్పవచ్చు. ఎడిట్ చేసిన ట్వీట్‌లు ప్లాట్‌ఫారమ్‌పై ఐకాన్, టైమ్‌స్టాంప్, లేబుల్‌తో కనిపిస్తాయని తెలిపింది. అసలు ట్వీట్ ఎడిట్ అయిందో లేదో అర్థం చేసుకునేందుకు యూజర్లకు సాయపడుతుందని Twitter ధృవీకరించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూపులో 1024 మందికి అనుమతి.. త్వరలోనే అందుబాటులోకి

ట్రెండింగ్ వార్తలు