KTR: అందుకే తెలంగాణ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? కేటీఆర్ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?

జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఉందని.. తర్వాత బడ్జెట్ సెషన్ నిర్వహించాల్సి ఉంటుందని, మార్చి, ఏప్రిల్లో విద్యార్థులకు పరీక్షలు..

KTR –BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Elections 2023)కు సిద్ధమవుతున్న వేళ ఇవి సమయానికే జరుగుతాయా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. అలాగే, దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయా? అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది.

దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ జమిలీ ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పు దోవ పట్టించే యత్నం చేస్తోందని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రోజు ముందు కూడా అధికారం వదులుకుంటారని తాను అనుకోవడం లేదని చెప్పారు.

కేంద్ర సర్కారు ముందస్తు ఎన్నికలకు వచ్చే అవకాశం లేదని తాను అనుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు. అందుకే అయిదు రాష్ట్రాల ఎన్నికలు జాప్యం చేయవచ్చని అన్నారు. జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఉందని, దానికి ముందు బీజేపీ ఎన్నికలకు సిద్ధం కాదని చెప్పారు.

అలాగే, జనవరి నెలాఖరుకు ఆ కార్యక్రమం పూర్తయితే బడ్జెట్ సెషన్ నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. మార్చి, ఏప్రిల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని, ఆ తరువాతే ఎన్నికలు జరపాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణలో అప్పటి వరకు ఎన్నికలు పూర్తికాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందని అన్నారు.

అయిదు రాష్ట్రాల్లో బీజేపీ ఎలాగో ఒడిపోనుందని, ఎలాగైనా వీటిని జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు పనిచేస్తోందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కేంద్రం సర్కారు వ్యూహం ఏంటో తెలిసే అవకాశం లేదని అన్నారు. మోదీ, అమిత్ షా ఎటువంటి తీరు సస్పెన్స్ గా ఉందని తెలిపారు. జమిలి ఎన్నికలు వస్తే తమకే మంచిదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరగాలంటే అక్టోబర్ 10 తేదీల్లోపు ఎన్నికల షెడ్యూల్ రావాలని అన్నారు.

Vijayasai Reddy: ఆయనను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం: విజయసాయిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు