MLA Rajasingh: వచ్చేసారి నేను ఉండకపోవచ్చు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. బయటివారితోపాటు సొంత వారుకూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటూ రాజాసింగ్ అన్నారు.

Goshamahal MLA MLA Rajasingh

BJP MLA Rajasingh: బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) అసెంబ్లీ (Assembly) లో సంచలన వ్యాఖ్యలు (Sensational comments)  చేశారు. నేను ఇక సభకు వస్తానోరానో తెలియదు. వచ్చే సభలో నేనైతే ఉండకపోవచ్చు అనుకుంటున్నా. నేను ఉన్నా, లేకున్నా తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని రాజాసింగ్ అన్నారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. బయటివారితోపాటు సొంత వారు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటూ రాజాసింగ్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందని రాజాసింగ్ అన్నారు. నియోజకవర్గంలో సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనులపై పలు వేదికలుగా, అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించానని రాజాసింగ్ అన్నారు.

MLA Rajasingh : తిరుపతి శ్రీవారి పార్వేట మండపం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కొద్దికాలంగా రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటును బీజేపీ అధిష్టానం తొలగిస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమేరకు బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం విముఖతతో ఉందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవల రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారంసైతం జరిగింది.

MLA Rajasingh : వార్డ్ ఆఫీసుల పేరుతో తెలంగాణ సర్కార్ షో పుటప్ : ఎమ్మెల్యే రాజాసింగ్

హరీష్ రావుతో భేటీపై రాజాసింగ్ వివరణ ఇచ్చారు. కేవలం తన నియోజకవర్గంలో సమస్యలను వివరించేందుకు మాత్రమే భేటీ అయ్యాయని, నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడనని రాజాసింగ్ చెప్పారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు