IIIT Basra : బాసర ట్రిపుల్ ఐటీలో ప్రమాదం.. క్లాస్ రూమ్‌లో ఊడిపడిన పెచ్చులు.. విద్యార్థికి గాయాలు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోజుకో కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వసతులు లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి కోసం విద్యార్థులు పోరుబాట కూడా పడ్డారు. ఇది చాలదన్నట్టు మరో ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు పైకప్పు పెచ్చులు విద్యార్థులను భయపెడుతున్నాయి.

IIIT Basara : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోజుకో కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వసతులు లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి కోసం విద్యార్థులు పోరుబాట కూడా పడ్డారు. ఇది చాలదన్నట్టు మరో ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు పైకప్పు పెచ్చులు విద్యార్థులను భయపెడుతున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇవాళ క్లాస్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. గదిలో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చులు ఊడి సరిగ్గా ఓ విద్యార్థి తల మీద పడ్డాయి. దీంతో ఆ విద్యార్థి గాయపడ్డాడు. పీయూసీ1 చదువుతున్న విద్యార్థి తలకు గాయాలు అయ్యాయి.

Governor Tamilisai : బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై.. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ

వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Basara IIIT Staff Bath : బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం.. వంట గదిలోనే సిబ్బంది స్నానాలు.. వీడియో వైరల్

కాగా.. పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థికి గాయం కావడంతో ఇతర విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బాసర ఐఐటీలో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు డ్యామేజీ అయిన తరగతి గదులకు రిపేరీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు