Telangana Elections 2023: కోదండరాం తమ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలని కోరారో తెలుసా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఈ విషయంపై చర్చలు జరిపారు.

kodandaram

Kodandaram: మరికొన్ని వారాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటోంది. అలాగే, పొత్తుల ద్వారా తమతో కలిసి పోటీచేసే పార్టీలతోనూ చర్చలు జరుపుతోంది. ఇవాళ హైదరాబాద్ లో టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాంతో కాంగ్రెస్ అధినాయకత్వం చర్చలు జరిపింది.

కోదండరాం తమ పార్టీకి మొత్తం ఆరు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఈ విషయంపై చర్చలు జరిపారు. అలాగే, ఆ ఆరుగురు టీజేఎస్ అభ్యర్థుల జాబితాను మాణిక్ రావు ఠాక్రేకు అందజేశారు.

గత తెలంగాణ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ తో టీజేఎస్ పొత్తుతో పోటీ చేసింది. మరోవైపు, కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో కొన్ని నియోజక వర్గాల అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు.

వారి పేర్లను కూడా త్వరలోనే ప్రకటించడానికి సిద్ధమవుతోంది. బీజేపీ తెలంగాణ ఎన్నికల బరిలో దింపేందుకు తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలను త్వరలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.

Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యుల్ ఖరారు, ఒకేరోజు రెండు సభలు

ట్రెండింగ్ వార్తలు