Samsung Galaxy A06 : శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లు లీక్..!

Samsung Galaxy A06 Launch : శాంసంగ్ గెలాక్సీ ఎ05 సక్సెసర్ 6.7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. . త్వరలో భారత మార్కెట్లో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy A06 Design, Key Specifications ( Image Source : Google )

Samsung Galaxy A06 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ06 ఫోన్ లాంచ్ కానుంది. రాబోయే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలను టిప్‌స్టర్ ద్వారా లీక్ చేసింది. ఈ లీకైన వివరాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎ06 ఈ ఏడాది ప్రారంభంలో ఎ సిరీస్‌లో లాంచ్ అయిన ఇతర మోడళ్లను పోలి ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో హ్యాండ్‌సెట్ కోసం సపోర్టు పేజీని అప్‌‌డేట్ చేసింది. త్వరలో భారత మార్కెట్లో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

శాంసంగ్ గెలాక్సీ A06 డిజైన్ (లీక్) :
టిప్‌స్టర్ గిచ్‌నె‌క్స్ట్ సహకారంతో శాంసంగ్ గెలాక్సీ ఎ06 డిజైన్ రెండర్‌లను లీక్ చేసింది. రాబోయే హ్యాండ్‌సెట్ నుంచి ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ఫీ కెమెరాను కలిగిన వాటర్‌డ్రాప్ కటౌట్‌తో ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. డిస్‌ప్లే చుట్టూ లార్జ్ బెజెల్స్, ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ06 రైట్ కార్నర్‌లో పవర్ (ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో) వాల్యూమ్ బటన్‌లు ఉన్నాయి.

గెలాక్సీ ఎ55, గెలాక్సీ ఎ35లలో కూడా కనిపించే కీ ఐలాండ్ పైనా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ ఎండ్ కలిగి ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు నిలువుగా డ్యూయల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. బ్యాక్ ప్యానెల్ దిగువన శాంసంగ్ లోగో పక్కన పెడితే.. ఈ హ్యాండ్‌సెట్‌లో లీకైన డివైస్ రెండర్‌లలో కనిపించే ఇతర బ్రాండింగ్ ఏదీ లేదు. 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, గెలాక్సీ ఎ06 కింది భాగంలో స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ06 స్పెసిఫికేషన్‌లు (లీక్) :
శాంసంగ్ గెలాక్సీ ఎ05 సక్సెసర్ 6.7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ వివరాల ప్రకారం.. మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్ అమర్చి ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజీ లేదా ఇతర మెమరీ వేరియంట్‌ల గురించి ప్రస్తావించలేదు. లీకైన ఫొటోలు ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చినట్టు సూచిస్తున్నాయి.

కెమెరా సెన్సార్ల వివరాలు ప్రస్తుతానికి తెలియవు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. నివేదిక ప్రకారం.. శాంసంగ్ ఇండియా గెలాక్సీ A06 ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే, మైస్మార్ట్‌ప్రైస్ భారత్‌లో కంపెనీ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ ఎస్ఎమ్-ఎ065ఎఫ్‌తో హ్యాండ్‌సెట్ సపోర్టు పేజీని గుర్తించింది.

Read Also : Poco F6 Deadpool : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!

ట్రెండింగ్ వార్తలు