KTR: ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ నేతలు ఏమైనా చేస్తారా? అనే అనుమానం ఉంది: కేటీఆర్ కామెంట్స్

మేడిగడ్డ పని అయిపోయిందన్నారని, కాళేశ్వరం పనికి రాదన్నారని కేటీఆర్ చెప్పారు.

KTR

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్లో పాల్గొన్నారు. గోదావరిలోకి 10 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని, మొత్తం పంపులు నడిపే అవకాశం ప్రభుత్వానికి ఉందని అన్నారు.

మేడిగడ్డ పని అయిపోయిందన్నారని, కాళేశ్వరం పనికి రాదన్నారని కేటీఆర్ చెప్పారు. కానీ పంపులు పని చేస్తున్నాయని తెలిపారు. కన్నెపల్లి నుంచి రోజు 3 టీఎంసీలు పంప్ చేయవచ్చని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక పేరు చెబుతూ పంప్ చేయబోమని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.

కన్నెపల్లి నుంచి నీటిని పంప్ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోందని అన్నారు. 10 లక్షల క్యూసెక్కుల తాకిడిని తట్టుకుని మెడిగడ్డ నిలబడలేదా అని నిలదీశారు. 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుందని చెప్పారు.

ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ నేతలు ఏమైనా చేస్తారా అనే అనుమానం ఉందని, ప్రస్తుత మంత్రుల గత చరిత్ర గతంలో ఏంటో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డకు ఏమైనా జరిగితే ప్రభుత్వానికి బాధ్యతని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్మిస్తోందని, మేడిగడ్డ విషయంలో జరుగుతున్న రాద్ధాంతం వేరే ప్రాజెక్టుల విషయంలో జరగడం లేదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ చెబితే నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఎన్నికలు కూడా లేవని, ఇంకా తమను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ కు ఏమి లాభమని ప్రశ్నించారు.

Also Read: ఢిల్లీలో కేంద్ర మంత్రితో చంద్రబాబు నాయుడు కీలక భేటీ

ట్రెండింగ్ వార్తలు