Union cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Narendra Modi

Tribal university: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ పై మరో రూ.100 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో, ఆ గ్యాస్ సిలిండర్ రాయితీ రూ.300కు పెరిగినట్లయింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరాలు తెలిపారు.

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. పసుపు రైతుల సంక్షేమసం కోసం తాము కృషి చేస్తామని చెప్పారు. అలాగే, ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆదీవాసీ దేవతల పేరు పెడుతున్నామని తెలిపారు. ఈ వర్సిటీకి రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా వాటికి ఆమోద ముద్ర వేసింది.

కాగా, కృష్ణ జల వివాదంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 2004లో కేంద్ర సర్కారుకి ఫిర్యాదులు చేశాయని అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఆ మూడు రాష్ట్రాల ఫిర్యాదుల మేరకు రెండో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైందని అన్నారు. 2013లో ట్రైబ్యునల్ నివేదిక ఇచ్చిందని చెప్పారు.

KTR : మీ అకౌంట్లో రూ.15లక్షలు పడితే మోడీకి ఓటు వేయండి, రైతుబంధు డబ్బులు పడితే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి : కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు