VBIT Photos Morphing Case : కటకటాల్లోకి సైకోలు.. VBIT కాలేజ్ మార్ఫింగ్ కేసులో ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్

సంచలనం రేపిన ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీలో అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడు విజయవాడలో పట్టుబడగా, మరో ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

VBIT Photos Morphing Case : సంచలనం రేపిన ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీలో అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడు విజయవాడలో పట్టుబడగా, మరో ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వీబీఐటీ కాలేజీ విద్యార్థినుల వాట్సాప్ డీపీల్లోని ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్స్ ను గ్రూపుల్లో సర్కులేట్ చేయడం సంచలనం రేపింది. ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మల్కాజ్ గిరి ఏసీపీ నరేష్. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఈ కేసు దర్యాఫ్తు కొనసాగుతోంది.

Also Read..Business With Dead Bodies : వామ్మో.. 560 మృతదేహాలను నరికి శరీర భాగాలు అమ్ముకుంది, డెడ్ బాడీస్‌తో బిజినెస్

ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు.. ఇంజినీరింగ్ విద్యార్థినుల నెంబర్లు ఎలా సేకరించారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇంతవరకు ఎంతమంది ఫోటోలు మార్ఫింగ్ చేశారు? విద్యార్థినుల వ్యక్తిగత వివరాలను కాలేజీ నుంచి ఎవరైనా ఇచ్చారా? అనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం విజ్ఞాన భారత ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ విద్యార్థినికి వాట్సాప్ లో ఓ లింక్ వస్తే క్లిక్ చేసింది. వెంటనే ఆ విద్యార్థిని డీపీ పిక్ ని మార్ఫింగ్ చేసి నూడ్ పిక్స్ గా మార్చేశారు. వాటితో బ్లాక్ మెయిల్ చేశారు. చివరికి వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే సీరియస్ గా ఉంటుందని బెదిరించారు కూడా.

Also Read..Delhi Anjali Case : పగిలిన తల, బయటకొచ్చిన ఎముకలు, ఇంకా దొరకని మొదడు.. ఢిల్లీ అంజలి కేసులో ఒళ్లు జలదరించే విషయాలు

మొన్న మరో విద్యార్థినికి అసభ్యకర మేసేజ్ లు రావడంతో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనలతో హాస్టల్ వార్డెన్ ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాఫ్తు చేపట్టిన ఘట్ కేసర్ పోలీసులు మేసేజ్ లు, ఫోన్ నెంబర్లు, ఐపీ అడ్రస్ ల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ లోని వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులు బరి తెగించారు. యువతుల వాట్సాప్ డీపీల్లోని ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్లుగా మార్చి వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేట్ చేశారు. వాటితో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితులను అందిరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు