YS Sharmila : వైఎస్ఆర్ కు కేసీఆర్ తీరని అన్యాయం..రేవంత్ రెడ్డి మోసకారి : వైఎస్ షర్మిల

రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంది చనిపోయారు..వాళ్లందరినీ కేసీఆర్ అవమానించారని పేర్కొన్నారు.

YS Sharmila : నేటితో వైఎస్ఆర్ టీపీ పార్టీ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలిపారు. ఇదే రోజు వైఎస్ఆర్ 73వ జయంతి అని పేర్కొన్నారు. ఏడాది కాలంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందన్నారు. నేటితో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గర అయ్యామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ టీపీ ఎండగట్టిందని చెప్పారు. పార్టీ పెట్టక ముందే ప్రజా సమస్యలపై పోరాటం చేశామని పేర్కొన్నారు. 1500 వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రం మొత్తం పూర్తి అయ్యేవరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

తెలంగాణలోని రాజ శేఖర్ రెడ్డి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. రాజ శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయం నిజం కాదా అని నిలదీశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావాలని వైఎస్సార్ కు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని వాపోయారు. హైదరాబాద్ లో రాజ శేఖర్ రెడ్డికి ఎలాంటి గౌరవ ప్రదమైన ప్లేస్ లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ చేసుకున్న స్వయం కృతాపరాధాల తెలంగాణలో పూర్తిగా కోల్పోయిందన్నారు. కేసీఆర్ కూడా వైఎస్ఆర్ కు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. 2004లో టీఆర్ఎస్ బలం ఎంత అని ప్రశ్నించారు.

YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..

రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంది చనిపోయారు..వాళ్లందరినీ కేసీఆర్ అవమానించారని పేర్కొన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ భవన్ ఇచ్చింది రాజ శేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాజ శేఖర్ రెడ్డి కోసం కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు.

హైదరాబాద్ లో రాజ శేఖర్ రెడ్డి గౌరవార్థం తక్షణమే స్థలాన్ని కేటాయించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ లను రాజకీయ నాయకులు గా చేసింది వైఎస్ఆర్ కాదా అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి ఒక దొంగ, మోసకారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్ళు చేసిన కామెంట్స్ కి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఒక టెరరిస్ట్ లాగా మాట్లాడారు… కాబట్టే రాజ శేఖర్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటు జరిగితే హైదరాబాద్ కు ఫ్లైట్ లో రావాలా అన్నారని గుర్తు చేశారు.

YS Sharmila : తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారు? : వైఎస్ షర్మిల

ఎన్నికలకు అరు నెలల ముందు రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని చెప్పారు. ముందస్తు ఎన్నికల ముచ్చట ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. అన్ని రాజకయ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడ్డా.. తాము కలవబోమని తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు