Disney Plus Share Password : నెట్‌‌ఫ్లి‌క్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై పాస్‌‌వర్డ్ షేరింగ్ చేయలేరు.. అదనంగా చెల్లించాల్సిందే..!

Disney Plus Share Password : డిస్నీ ప్లస్ యూజర్లు ఇకపై తమ అకౌంట్ పాస్‌వర్డ్ బయటివారితో షేరింగ్ చేయడం కుదరదు. ఒకవేళ పాస్‌వర్డ్ షేరింగ్ చేయాల్సి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

After Netflix now Disney Plus will not allow users to share password

Disney Plus Share Password : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ యాప్ డిస్పీ ప్లస్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఇతరులతో మీ అకౌంట్ పాస్‌వర్డ్ షేర్ చేసుకోలేరు. ఒకవేళ అలాచేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాదిలో మరో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కూడా యూజర్ల అకౌంట్లపై పలు పరిమితులను విధించింది.

ప్రధానంగా పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ యూజర్‌లు తమ స్నేహితులతో లేదా ఇంటి బయట ఎవరితోనైనా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకుండా నియంత్రించడం ప్రారంభించింది. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం, యూజర్ బేస్ పెంచుకోనే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ అడుగుజాడల్లోనే డిస్నీ ప్లస్ రాబోయే నెలల్లో సొంత పాస్‌వర్డ్-షేరింగ్‌పై కంట్రోలింగ్ చేయాలని యోచిస్తోంది.

Read Also : Kinetic E-Luna Scooter : కైనెటిక్ గ్రీన్ నుంచి సరికొత్త ‘ఇ-లూనా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 110 కిలోమీటర్ల రేంజ్..

డిస్నీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హ్యూ జాన్‌స్టన్ మాట్లాడుతూ.. డిస్నీ ప్లస్ అకౌంట్ల పాస్‌వర్డ్ షేరింగ్ చేయడంపై పరిమితులు విధిస్తున్నట్టు వెల్లడించారు. ఇకపై ఎవరైనా వేరొకరి అకౌంట్ నుంచి సైన్ అప్ చేసేందుకు ప్రయత్నిస్తే.. సొంత సబ్‌స్క్రిప్షన్ సైన్‌అప్ ఆప్షన్ కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఈ వేసవిలో (2024 మార్చి నుంచి) ప్రారంభమయ్యే పాస్‌వర్డ్‌లను షేర్ చేయకుండా కంపెనీ నియంత్రించనుందని జాన్‌స్టన్ పేర్కొన్నారు.

అదనపు ఛార్జీలు తప్పవు :
డిస్నీ యూజర్లను ఇతరుల అకౌంట్లపై ఆధారపడకుండా నియంత్రించేందుకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతుంది. డిస్నీ ఖాతాదారులు వివిధ గృహాలలో నివసించే వారిని తమ అకౌంట్లో యాడ్ చేసుకోవాలంటే అదనపు రుసుమును చెల్లించేందుకు అనుమతిస్తుంది. గతంలోనే నెట్‌ఫ్లిక్స్ తమ వినియోగదారులను ఇంటి వెలుపల అకౌంట్ సైన్ అప్‌ అనుమతికి కొంచెం అదనంగా రుసుమును వసూలు చేస్తోంది. అయితే, అన్ని ప్రాంతాలలో ఇది అందుబాటులో లేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇంటి వెలుపల నివసించే వారిని అకౌంట్లలో చేర్చుకునేందుకు నెలకు 7.99 డాలర్లు వసూలు చేస్తోంది.

Netflix Disney Plus share password

మార్చి 14 నుంచి పాత సబ్‌స్రైబర్లకు వర్తింపు :
డిస్నీ ప్లస్ పాస్‌వర్డ్ షేరింగ్ ఫీజు మొత్తాన్ని వెల్లడించలేదు. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా డిస్నీ తమ సబ్‌స్క్రైబర్ బేస్‌ని పెంచుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా, డిస్నీ ప్లస్ వినియోగదారులు వారితో నివసించని వ్యక్తులతో వారి సభ్యత్వాలను షేర్ చేయకుండా నిషేధించడానికి ఈ ఏడాదిలోనే నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 25 నుంచి కొత్త సబ్‌స్క్రైబర్‌లకు వర్తించగా.. ఇప్పటికే ఉన్న పాత సబ్‌స్క్రైబర్‌లకు మాత్రం మార్చి 14 నుంచి వర్తించనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ వ్యూహం ఫలించింది :
నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి స్ట్రీమింగ్ సర్వీస్‌లు పాస్‌వర్డ్ షేరింగ్‌ని పరిమితం చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గడమే.. అందుకే ఈ కంపెనీలు ఇతర టెక్ దిగ్గజాల మాదిరిగానే లాభాల కోసం పోటీపడుతున్నాయి. పాస్‌వర్డ్ షేరింగ్ కారణంగా తక్కువ మంది మాత్రమే సబ్‌స్ర్కిప్షన్ తీసుకుంటారు. తద్వారా కంపెనీ ఆదాయాన్ని భారీగా ప్రభావితం చేస్తుంది. పాస్‌వర్డ్ షేర్ చేసేవారిని పేయింగ్ కస్టమర్‌లుగా మార్చడం ద్వారా తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని స్ట్రీమింగ్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ పరిమితం చేసిన తర్వాత 9 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లు వచ్చినట్టు కంపెనీ నివేదించింది.

యాడ్ రెవిన్యూ కోసం కొత్త ప్లాన్లు :
ఇటీవల స్ట్రీమింగ్ సర్వీసులు పాస్‌వర్డ్ షేరింగ్‌తో పాటు యాడ్ రెవిన్యూ కోసం కొత్త యాడ్-ఫోకస్డ్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే కొత్త యాడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. వినియోగదారులకు తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇందులో యాడ్స్‌ కూడా ఉంటాయని గమనించాలి. కంపెనీ బేసిక్ ప్లాన్‌ను తొలగించాలని భావిస్తోంది. అదేగానీ జరిగితే వినియోగదారులు అధిక ధరకు బేస్ ప్లాన్‌ను పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెజాన్ ప్రైమ్ కూడా తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇటీవల ఒక యాడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

Read Also : BHIM Cashback Offers : భీమ్ యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఇలా ఈజీగా పొందొచ్చు!

ట్రెండింగ్ వార్తలు