Usha Chilukuri Vance : భారతీయ సీఈఓను నియమించుకోండి.. ఉషా చిలుకూరి వాన్స్‌పై పోస్టుకు మస్క్ రియాక్షన్..!

Usha Chilukuri Vance : జేడీ వాన్స్ భార్య భారతీయ మూలాల గురించి అనేక మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

Elon Musk responds to Indian man's post ( Image Source : Google )

Usha Chilukuri Vance : ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈ వాన్స్ జంట గురించి నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది.

Read Also : YouTube New Guidelines : యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్.. ఇక ఏఐ ఆధారిత వీడియోలపై యూజర్ల చేతుల్లో స్పెషల్ పవర్..!

ఎందుకంటే.. వాన్స్ భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన వ్యక్తి కావడమే కారణం. ప్రతిష్టాత్మక శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయ సంస్థలో ఆమె కార్పోరేట్ లిటిగేటర్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అసలు ఉషా చిలుకూరి ఎవరు అని తెగ సెర్చ్ చేస్తున్నారట.. సోషల్ మీడియా మొత్తం ఈ జంటకు సంబంధించిన పోస్టులతోనే నిండిపోయింది.

జేడీ వాన్స్ భార్య భారతీయ మూలాల గురించి అనేక మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. వారిలో ఒకరైన డాక్టర్ పారిక్ పటేల్ ఎక్స్ వేదికగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.

స్మైల్ ఎమోజీతో మస్క్ ట్వీట్ : 
అంతేకాదు.. “మీరు భారతీయ సీఈఓని నియమించుకోండి లేదా మీరే భారతీయులుగా మారడానికి చాలా కాలం జీవించండి”అంటూ ఆయన ట్వీట్ చేశారు. దానికి వాన్స్, ఉషా చిలుకూరి తమ పసిపాపతో కలిసి ఉన్న ఫొటోను కూడా జత చేశారు. ఇప్పుడా ఆ పోస్టు మస్క్ దృష్టిని ఆకర్షించింది. భారతీయ యూజర్ పోస్ట్‌కు మస్క్ మామ స్పందిస్తూ.. ఒక స్మైల్ ఎమోజీని కూడా పోస్టు చేశారు.. ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఉషా చిలుకూరి వాన్స్ ఎవరంటే? :
ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఉషా చిలుకూరి వాన్స్ శాన్‌డియాగోలోని మౌంట్ కార్మెల్ హైస్కూల్‌లో చదివారు. యేల్ యూనివర్శిటీలో బీఏ పూర్తి చేశారు. ఆ తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుంచి ఆధునిక చరిత్రలో ఎంఫిల్, యేల్ లా స్కూల్ నుంచి ఆమె లా డిగ్రీని పూర్తి చేసింది.

జేడీ వాన్స్ తన జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తన భార్య కీలక పాత్ర గురించి ఎప్పుడూ ఓపెన్‌గానే చెబుతుంటారు. “నేను అడగడానికి కూడా తెలియని ప్రశ్నలను ఆమె సహజంగానే అర్థం చేసుకుంది. నాకు తెలియని అవకాశాలను వెతకమని ఆమె ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించింది” అని వాన్స్ యేల్ యూనివర్శిటీలో వారి విద్యార్థి రోజులను 2022 ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఈ జంట యేల్ యూనివర్శిటీ నుంచి పట్టభద్రులయ్యారు. 2014లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఇవాన్, వివేక్, మిరాబెల్ ఉన్నారు.

Read Also : Liquor Home delivery : మద్యం ప్రియులకు కిక్కే కిక్కు.. స్విగ్గీ, జొమాటోలో త్వరలో ఇంటికే మద్యం డెలివరీ.. ఏయే రాష్ట్రాల్లో ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు