Liquor Home delivery : మద్యం ప్రియులకు కిక్కే కిక్కు.. స్విగ్గీ, జొమాటోలో త్వరలో ఇంటికే మద్యం డెలివరీ.. ఏయే రాష్ట్రాల్లో ఉండొచ్చుంటే?

Liquor Home delivery : ప్రముఖ పాపులర్ ఫుడ్ డెలివరీ ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలైన జొమాటో, స్విగ్గీ సహా బిగ్ బాస్కెట్ కంపెనీలే త్వరలో మద్యం డెలివరీ చేసే అవకాశం ఉంది. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగానే నచ్చిన బ్రాండ్ మద్యం ఆర్డర్ చేసుకోవచ్చు.

Liquor Home delivery : మద్యం ప్రియులకు కిక్కే కిక్కు.. స్విగ్గీ, జొమాటోలో త్వరలో ఇంటికే మద్యం డెలివరీ.. ఏయే రాష్ట్రాల్లో ఉండొచ్చుంటే?

Home delivery of alcohol in India_ Zomato, Swiggy, Bigbasket being considered ( Image Source : Google )

Updated On : July 16, 2024 / 6:24 PM IST

Liquor Home delivery : మద్యం ప్రియులకు కిక్కే కిక్కు.. మద్యం కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు.. హాయిగా ఇంట్లో కూర్చొనే మద్యం తెప్పించుకోవచ్చు. ఇలా ఆర్డర్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలో మద్యం హోం డెలివరీ కానుంది. ఇది ఎక్కడో కాదు.. మన దేశంలోనే అందుబాటులోకి రానుంది.

Read Also : YouTube New Guidelines : యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్.. ఇక ఏఐ ఆధారిత వీడియోలపై యూజర్ల చేతుల్లో స్పెషల్ పవర్..!

ప్రముఖ పాపులర్ ఫుడ్ డెలివరీ ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలైన జొమాటో, స్విగ్గీ సహా బిగ్ బాస్కెట్ కంపెనీలే త్వరలో మద్యం డెలివరీ చేసే అవకాశం ఉంది. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగానే ఈ ప్లాట్‌‌ఫారాల నుంచి నచ్చిన బ్రాండ్ మద్యం ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కొత్త విధానం ముందుగా కొన్ని రాష్ట్రాల్లో అందుబాటలోకి రానుంది. అయితే, ఇప్పటికే, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో ఆల్కాహాల్ డోర్ డెలివరీ విధానం అమలులో ఉంది.

మరో ఏడు రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలతో మద్యం తయారీదారులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ మాదిరిగా ఆన్‌లిమిటెడ్ ఆల్కాహాల్ డెలివరీ కుదరదట. పరిమిత సంఖ్యలోనే మద్యం డెలివరీ చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నేషనల్ మీడియాలో కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ, ఈ కొత్త విధానం గానీ అమల్లోకి వస్తే.. మద్యం ప్రియులకు కిక్కే కిక్కు.. వైన్ షాపు కోసం వెతకాల్సిన పనిలేదు. కూర్చొన్న చోటకే ఇంటికి మద్యం తెప్పించుకోవచ్చు.

ఈ రాష్ట్రాల్లో మద్యం డోర్ డెలివరీ విధానం? :
న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హరియాణా, గోవా రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా మద్యం డోర్ డెలివరీ విధానం అమలు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు.. మద్యం హోం డెలివరీ చేయడం ద్వారా కలిగే లాభనష్టాలపై అంచనాకు వచ్చిన తర్వాతే ఏది అనేది నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది.

కరోనా టైంలో ఝార్ఖండ్, మహారాష్ట్ర, అస్సాం చత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా ఆల్కాహాల్ హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత మద్యం డెలివరీపై నిషేధం విధించాయి. కానీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ మద్యం డెలివరీ విధానం కొనసాగుతూనే ఉంది. ఇలా డోర్ డెలివరీ అనుమతితో మద్యం అమ్మకాలు కూడా 20 శాతం నుంచి 30 శాతం పెరిగినట్లు రిటైల్ పరిశ్రమ సంబంధిత వర్గాలు పేర్కొన్నట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి.

Read Also : Ananya Panday : ఫ్యామిలీతో కలిసి అనంత్ అంబానీ పెళ్ళిలో సందడి చేసిన అనన్య పాండే..