BHIM Cashback Offers : భీమ్ యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఇలా ఈజీగా పొందొచ్చు!

BHIM App Cashback Offers : మీరు భీమ్ యాప్ వాడుతున్నారా? రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

BHIM app is giving up to Rs 750 cashback offers

BHIM App Cashback Offers : భీమ్ యాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ప్రముఖ డిజిటల్ మొబైల్ పేమెంట్స్ యాప్ భీమ్ (BHIM) తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది.  ఈ ఆఫర్లు ముగియడానికి ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది.

Read Also : Tech Tips in Telugu : BHIM యూపీఐ ద్వారా UPI PIN రీసెట్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

గూగుల్ పే మాదిరిగా యూజర్ బేస్ పెంచుకునేందుకు భీమ్ ప్లాట్‌ఫారమ్ అనేక ఆఫర్లను గుప్పిస్తోంది. షరతులతో కూడిన ఆఫర్లతో పాటు విభిన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మొత్తంగా భీమ్ తమ ప్లాట్‌ఫారంపై రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలంటే? :
ఫుడ్ ఆర్డర్లు లేదా ట్రావెల్ చేసే వినియోగదారులు భీమ్ యాప్ ద్వారా రూ. 150 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ పొందవచ్చు. వినియోగదారులు భీమ్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ ఖర్చుల కోసం రూ. 100 కన్నా ఎక్కువ లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. తద్వారా రూ. 30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను అందుకుంటారు. ఈ ఆఫర్‌లో రైల్వే టిక్కెట్ బుకింగ్‌లు, క్యాబ్ రైడ్‌లు, మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే రెస్టారెంట్ బిల్లులు ఉంటాయి. గరిష్టంగా రూ. 150 క్యాష్‌బ్యాక్‌తో వినియోగదారులు కనీసం 5 సార్లు ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

BHIM app cashback offers

మరో రూ. 600 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందొచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు భీమ్ యాప్‌ లింక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అన్ని మర్చంట్ యూపీఐ పేమెంట్లపై రూ. 600 క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో ఒక్కొక్కటి రూ. 100 దాటిన మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 లావాదేవీలపై అదనంగా రూ. 30 క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చు. ఈ పేమెంట్లను పూర్తిస్థాయిలో చేయడం ద్వారా మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఫ్యూయల్ పేమెంట్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు :
భీమ్ యాప్ ఉర్జా (Urja) ఒక శాతం స్కీమ్ కూడా అందిస్తోంది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ‌తో సహా అన్ని ఫ్యూయల్ పేమెంట్లపై 1 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అంతేకాదు.. రూ. 100 లేదా ఎక్కువగా చెల్లించినవారికి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, గ్యాస్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపులపై కూడా భారీ ప్రయోజనం లభిస్తుంది. భీమ్ యాప్‌తో లింక్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది.

ఆఫర్లు ఎప్పటివరకంటే? :
భీమ్ యాప్‌లో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. భీమ్ యాప్‌ని ఉపయోగించి అన్ని క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందవచ్చు. అయితే, ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయ్యేందుకు కనీసం 7 వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని గమనించాలి.

Read Also : Kinetic E-Luna Scooter : కైనెటిక్ గ్రీన్ నుంచి సరికొత్త ‘ఇ-లూనా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 110 కిలోమీటర్ల రేంజ్..

ట్రెండింగ్ వార్తలు