YouTube New Guidelines : యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్.. ఇక ఏఐ ఆధారిత వీడియోలపై యూజర్ల చేతుల్లో స్పెషల్ పవర్..!

YouTube New Guidelines : ఏఐ రూపొందించిన కంటెంట్‌ను గుర్తించడంతో పాటు తప్పుడు సమాచారం గురించిన ఆందోళనలను పరిష్కరించడానికి యూట్యూబ్ ఈ కొత్త అప్‌‌డేట్ ఆవిష్కరించింది.

New YouTube guidelines announced for AI-based videos ( Image Source : Google )

YouTube New Guidelines : యూట్యూబ్ క్రియేటర్లకు అలర్ట్.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం.. యూట్యూబ్ క్రియేటర్లు ఇకపై ఏఐ కంటెంట్ క్రియేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Read Also : YouTube Create App : భారతీయ యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్.. ఈ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు!

లేదంటే ఆ కంటెంట్ డిలీట్ చేయడంతో పాటు సస్పెన్షన్ పడే ప్రమాదం ఉంది. ఏఐ కంటెంట్ గుర్తించడంలో వీక్షకుల చేతికి యూట్యూబ్ పవర్ అందిస్తుంది. ఏఐ రూపొందించిన కంటెంట్‌ను గుర్తించడంతో పాటు తప్పుడు సమాచారం గురించిన ఆందోళనలను పరిష్కరించడానికి యూట్యూబ్ ఈ కొత్త అప్‌‌డేట్ ఆవిష్కరించింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. క్రియేటర్‌లు తమ వీడియోలను ఏఐ ఉపయోగించి ఎప్పుడు రూపొందించారో లేదా మార్చారో బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రైవసీ అభ్యర్థన ప్రక్రియ ద్వారా రూపొందించిన నిర్దిష్ట ఏఐ కంటెంట్ తొలగించమని అభ్యర్థించడానికి ప్లాట్‌ఫారమ్ వీక్షకులకు ఆప్షన్ కూడా అందిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐ కంటెంట్‌కు లేబులింగ్ తప్పనిసరి :
ముఖ్యంగా ఎన్నికలు కొనసాగుతున్న వేళ సంఘర్షణలు, పబ్లిక్ ఫిగర్స్ వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌కు ఈ ట్రాన్స్‌పరెన్సీ విధానం చాలా ముఖ్యమైనది. ఈ కొత్త మార్గదర్శకాలు రాబోయే నెలల్లో అమల్లోకి రానున్నాయి. క్రియేటర్లు ఏఐ రూపొందించిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలి. యూట్యూబ్ వీడియో ప్లేయర్, డిస్ర్కప్షన్ ప్యానెల్‌కు ప్రముఖ లేబుల్‌లను అందిస్తుంది. కంటెంట్ ఆర్టిషిఫియల్‌గా క్రియేట్ చేయడం లేదా మార్ఫింగ్ చేసినట్టుగా సూచిస్తుంది.

ఏఐ రూపొందించిన మీడియా ద్వారా వీక్షకులు తప్పుదారి పట్టకుండా నిరోధించడం, వారు చూస్తున్న కంటెంట్ స్వభావాన్ని వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించడం దీని లక్ష్యంగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో, లేబులింగ్ మాత్రమే సరిపోకపోవచ్చు. లేబులింగ్‌తో సంబంధం లేకుండా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. నిర్దిష్ట సింథటిక్ మీడియా ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించాల్సి ఉంటుందని యూట్యూబ్ పేర్కొంది.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు :
ఈ కఠినమైన విధానంతో యూట్యూబ్ కంటెంట్ సమగ్రత, వీక్షకులను ప్రైవసీ మరింతగా ప్రొటెక్ట్ చేయడంలో సాయపడుతుంది. అదనంగా, ప్రైవసీ రిక్వెస్ట్ ప్రక్రియ ద్వారా నిర్దిష్ట ఏఐ రూపొందించిన లేదా మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను తొలగించమని అభ్యర్థించడానికి యూట్యూబ్ యూజర్లకు అధికారం ఇస్తుంది. ఈ అభ్యర్థనలతో కంటెంట్ పేరడీ లేదా వ్యంగ్యంగా ఉన్నట్టుగా ప్రత్యేకంగా గుర్తించగలిగితే ప్రభుత్వ అధికారులు లేదా ప్రముఖలకు సంబంధించి అంశాల ఆధారంగా చర్యలు తీసుకోనుంది. ఈ కొత్త నిబంధనలు అతిక్రమించిన క్రియేటర్ల కంటెంట్ డిలీట్ చేస్తుంది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్ లేదా ఇతర క్రమశిక్షణా చర్యలతో సహా జరిమానాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ప్రైవసీ ఉల్లంఘనపై ఫిర్యాదు వస్తే.. :
ప్రైవసీపరమైన ఫిర్యాదు దాఖలైతే.. యూట్యూబ్ అప్‌లోడర్‌కు వారి వీడియోలోని ప్రైవేట్ సమాచారాన్ని తొలగించడం లేదా సవరించడానికి అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ఆ కంటెంట్ ఉల్లంఘన గురించి అప్‌లోడర్‌కు తెలియజేయనుంది. యూట్యూబ్ ఆయా అప్‌లోడర్లకు 48 గంటల సమయం ఇవ్వవచ్చు. ఈ సమయంలో క్రియేటర్ తమ యూట్యూబ్ స్టూడియోలో అందుబాటులో ఉన్న ట్రిమ్ లేదా బ్లర్ టూల్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అప్‌లోడర్ వీడియో రిమూవ్ చేయడానికి బదులుగా మరో ఆప్షన్ ఎంచుకుంటే.. ఆ కంప్లయింట్ క్లోజ్ అవుతుంది. అప్పటికీ ఆ ప్రైవసీ ఉల్లంఘన అలానే ఉంటే.. యూట్యూబ్ టీమ్ దాన్ని రివ్యూ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Read Also : Apple iPhone 13 : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13 ధర కేవలం రూ. 47,999 మాత్రమే.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

ట్రెండింగ్ వార్తలు