Samsung Galaxy A56 5G Review : ఈ శాంసంగ్ ఫోన్ చూస్తే ఇతర బ్రాండ్లు షేక్ అవ్వాల్సిందే.. శాంసంగ్ గెలాక్సీ A56 5G మాస్ రివ్యూ..!
Samsung Galaxy A56 5G Review : మీరు ఈ శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ ఎలా ఉందో చూశారా? కెమెరా ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు. ధర ఎంతంటే?
Samsung Galaxy A56 5G Review
Samsung Galaxy A56 5G Review : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రీమియం ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. గత మార్చిలో శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన డిజైన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 6 ఏళ్ల అప్‌డేట్స్, లాంగ్ టైమ్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లిమిటెడ్ డీల్‌లో రూ. 7వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ A56 5G ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 48,999కు లాంచ్ అయింది. కానీ, అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌లో 14శాతం ధర తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 41,999కే కొనుగోలు చేయవచ్చు. తద్వారా రూ. 7వేలు ఆదా చేసుకోవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
డిజైన్ :
శాంసంగ్ గెలాక్సీ A56 5జీ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 1900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
అల్యూమినియం ఫ్రేమ్‌వర్క్ గత వెర్షన్‌తో పోలిస్తే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్ కూడా పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అవ్‌సామ్ గ్రాఫైట్, అవ్‌సామ్ లైట్ గ్రే, అవ్‌సామ్ ఆలివ్, అవ్‌సామ్ పింక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
కెమెరా సెటప్ :
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. స్టేబుల్ షాట్‌ల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ 4K వీడియోలను రికార్డ్ చేయగల 12MP సెల్ఫీ కెమెరా ఉంది. తక్కువ కాంతిలో క్లియర్ ఫొటోల కోసం ఫోన్ మెరుగైన నైట్ ఫొటోగ్రఫీని కూడా అందిస్తుంది.
డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ A56 5జీ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1580 చిప్‌సెట్ కలిగి ఉంది. రోజువారీ పనులకు అద్భుతంగా ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ 6GB, 8GB లేదా 12GB LPDDR5 ర్యామ్, 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజ్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జనరేషన్ OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది. బాక్స్ వెలుపల వన్ యూఐ7తో ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇన్‌స్టంట్ స్లో-మోషన్ బెస్ట్ ఫేస్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ :
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. మీరు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ త్వరగా ఛార్జ్ చేయవచ్చు.
