Amaravathi : అమరావతిలో ఫిల్మ్ సిటీ..!?
ఏపీ రాజధాని అమరావతిలో (Amaravathi) ఇంటర్ నేషనల్ ఫిల్మ్ సిటీ నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్ నడుస్తుంది.
Film Hub In Amaravathi
Amaravathi : ఇప్పటికీ టాలీవుడ్ కేరాఫ్ హైదరాబాదే. పదుల సంఖ్యలో సినీ స్టూడియోలు, వందల సంఖ్యలో మల్టీఫ్లెక్సులు, షూటింగ్‌లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ సినిమాల షూటింగ్స్ అయినా హైదరాబాదే ఫిల్మ్ డెస్టినేషన్ అయిపోయింది.
అయితే ఏపీ రాజధాని అమరావతిలో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ సిటీ నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్ నడుస్తుంది. హాలీవుడ్ రేంజ్లో హైటెక్ హంగులతో అమరావతిలో దాదాపు 500 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మించడానికి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ముందుకు వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫిల్మ్ సిటీ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో సంజయ్ దత్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేస్తే టూరిజం డెవలప్మెంట్తో పాటు, చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఏపీ కూడా సినిమాల షూటింగ్‌లకు కేరాఫ్‌గా మారే అవకాశం ఉంటుందంటున్నారు.
సింగిల్ విండో సిస్టమ్‌లో పర్మిషన్లు తీసుకొని షూటింగ్స్ చేయొచ్చని, దీనికి టాలీవుడ్ కూడా ముందుకు వస్తుందన్న చర్చ నడుస్తుంది. సంజయ్ దత్, ఏపీ మంత్రి లోకేశ్‌తో ముంబైలో భేటీ అయ్యారని..ఫిల్మ్ సిటీ నిర్మాణంపై ఒక్కో అడుగు ముందుకు పడుతుందని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అమరావతిలో ఇంటర్ నేషనల్ రేంజ్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు సాధ్యమేనా.? అనేది చర్చనీయాంశంగా మారింది.
