IND vs WI : భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? టీమ్ఇండియాకు వరుణుడు సాయం చేస్తాడా?
భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు (IND vs WI) వర్షం ముప్పు ఉందా ? రద్దు అయితే పరిస్థితి ఏంటి ? ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి.
Kolkata Weather report Will Rain Spoil IND vs WI match in T20 world cup match
- నేడు భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్
- వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సెమీస్‌కు వెస్టిండీస్
- భారత్ ఇంటికి
IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మిగిలి ఉన్న ఒక్కస్థానం కోసం భారత్, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. కాగా.. ఆదివారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా ? రద్దు అయితే పరిస్థితి ఏంటి ? ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి.
మ్యాచ్ రద్దు అయితే..?
పాయింట్ల పట్టికలో భారత్, వెస్టిండీస్ జట్లు చెరో రెండు పాయింట్లను కలిగి ఉన్నాయి. అయితే.. విండీస్ నెట్‌రన్‌రేటు (+1.791) భారత్ నెట్‌రన్‌రేటు (-0.100) కంటే మెరుగ్గా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు.
అప్పుడు కూడా భారత్, వెస్టిండీస్ జట్లు చెరో మూడు పాయింట్లతో సమానంగా ఉంటాయి. కానీ మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన వెస్టిండీస్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
వర్షం ముప్పు ఎంత ?
అక్యూవెదర్ ప్రకారం.. మ్యాచ్ రోజున కోల్‌కతాలో ఎలాంటి వర్షం పడే అవకాశం లేదు. చక్కగా ఎండ కాస్తుంది. మ్యాచ్ జరిగే సమయంలో 25 నుంచి 26 డిగ్రీలుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే.. మంచు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదన వైపు ఇరు జట్లు మొగ్గు చూపొచ్చు.
