Holi BanK Holiday : హోలీ ఎప్పుడు? మార్చి 3, 4 తేదీనా? బ్యాంకులకు ఈ తేదీల్లో హాలీడే ఉంటుందా? బ్యాంకు సెలవుల ఫుల్ లిస్ట్!
Holi BanK Holiday : 2026 మార్చి 3న లేదా 4న హోలీ జరుపుకుంటారా అనేదానిపై గందరగోళం నెలకొంది. అధికారిక హోలీ హాలీడే ఎప్పుడు? బ్యాంకులకు సెలవు ఉంటుందా? లేదో చూద్దాం..
Holi BanK Holiday ( Image Credit : Gemini AI)
Holi BanK Holiday 2026 : మీరు హోలీ రోజున బ్యాంకుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. హోలీ పండగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 బ్యాంకు సెలవుల అధికారిక జాబితాను ప్రకటించింది. ఇందులో జాతీయ, ప్రాంతీయ పండుగల్లో బ్యాంకు శాఖలు పనిచేయని తేదీలు ఉన్నాయి. బ్యాంకులకు సెలవులు సాధారణంగా రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.
కొన్ని పండుగలు నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే జరుపుకుంటారు. ఆయా ప్రాంతాల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ వారం మీకు ఏవైనా బ్యాంకింగ్ పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. హోలీ పండగ రోజున బ్యాంకులకు సెలవులు ఉండొచ్చు.
ఇంతకీ హోలీ పండగ ఎప్పుడు? మార్చి 3 లేదా మార్చి 4 ఉంటుందా? అసలు హోలీకి బ్యాంకులకు హాలిడే ఉంటుందా? లేదా మీ ప్రాంతంలో బ్యాంకులు తెరిచే ఉంటాయా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హోలీ పండగ బ్యాంకు సెలవులు :
2026 హోలీ రంగుల పండుగ మార్చి 4 (బుధవారం)న జరగనుంది. కానీ, RBI బ్యాంకు హాలిడే క్యాలెండర్ ప్రకారం.. హోలీతో సంబంధం ఉన్న వివిధ రోజుల్లో అనేక నగరాలు, రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. మార్చి 2 సోమవారం రోజున హోలికా దహన్ సందర్భంగా కాన్పూర్, లక్నో వంటి కొన్ని నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి. ఇతర ప్రాంతాలలో మాత్రం బ్యాంకులు ఎప్పటిలాగే పనిచేస్తాయి.
మార్చి 3, 2026 (మంగళవారం), హోలీ కోసం అనేక ప్రధాన నగరాల్లో బ్యాంకు శాఖలు మూతపడతాయి. ఈ నగరాల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా, పాట్నా, రాంచీ, భోపాల్, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్, నాగ్పూర్, పనాజీ, బేలాపూర్, విజయవాడ ఉన్నాయి. నివాసితులు తమ బ్యాంకింగ్ అవసరాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.
మార్చి 4, 2026న (బుధవారం) దేశవ్యాప్తంగా హోలీ జరుపుకుంటారు. ఉత్తర, మధ్య భారత్ లో అనేక ప్రాంతాలలో ఈ రోజున బ్యాంకులు పనిచేయవు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, కాన్పూర్, పాట్నా, రాంచీ, చండీగఢ్, సిమ్లా, జమ్మూ, రాయ్పూర్, భువనేశ్వర్, అగర్తల, ఇటానగర్, షిల్లాంగ్, ఇంఫాల్లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చిలో బ్యాంకులకు సెలవులివే :
- మార్చి 13 : చాప్చర్ కుట్ (కొన్ని రాష్ట్రాలలో)
- మార్చి 17 : షబ్-ఇ-ఖాదర్ (జమ్మూ,కాశ్మీర్)
- మార్చి 19 : గుడి పడ్వా, ఉగాది పండుగలు
- మార్చి 20-21 : ఈద్-ఉల్-ఫితర్ / ఈద్
- మార్చి 26-27 : శ్రీరామనవమి
- మార్చి 31 : కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండగల ఆధారంగా సెలవు
ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసులు :
బ్యాంకులకు సెలవులు ఉన్నా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు నిలిచిపోవు. ఆన్లైన్ బ్యాంకింగ్ (UPI, మొబైల్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం) సర్వీసులు యధావిధిగా కొనసాగుతాయి. డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకు బ్రాంచ్ ద్వారా చెక్ డిపాజిట్లు, కేవైసీ అప్ డేట్స్, డ్రాఫ్ట్లు) మాత్రం అందుబాటులో ఉండవు. ఈ పనులు పూర్తి చేయాలంటే సెలవులకు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.
