Ola Maps Services : గూగుల్ మ్యాప్స్‌కు గుడ్‌బై.. ఇకపై ఓలా సొంత మ్యాప్స్‌‌‌తోనే నేవిగేషన్..!

Ola Maps Navigation : ఓలా యాప్‌ని చెక్ చేసి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సరికొత్త ఫీచర్లను కూడా యాక్సస్ చేయొచ్చు. ఓలా మ్యాప్స్ ఏపీఐ @Krutrim క్లౌడ్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది.

Ola Maps for better navigation ( Image Source : Google )

Ola Maps Services : ప్రముఖ రైడ్ షేరింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ఓలా తమ వినియోగదారుల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్, మైక్రోసాఫ్ట్ అజూర్‌ను ఓలా పూర్తిగా తమ ప్లాట్ ఫారం నుంచి తొలగించింది. ఇప్పుడు, గూగుల్ మ్యాప్స్‌కు గుడ్‌బై చెప్పేసి.. సొంత ఇంటర్నట్ టెక్నాలజీతో రూపొందించిన ఓలా మ్యాప్‌లను ఉపయోగిస్తోంది. ఈ మార్పు కంపెనీకి ప్రతి ఏడాదిలో భారీ ఆర్‌ఎస్ 100 కోట్లను ఆదా చేస్తోంది. గూగుల్ మ్యాప్స్‌లో ఏటా రూ. 100 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

Read Also : Google Maps Save Fuel : గూగుల్ మ్యాప్స్‌‌‌లో కొత్త ఫీచర్.. ఈ నావివేగషన్‌తో మీ వెహికల్ ఇంధనాన్ని ఆదా చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

ఈ నెల ఓలా మ్యాప్స్‌కు మారడం ద్వారా అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా సున్నాకి తగ్గించినట్టు తెలిపారు. గూగుల్ మ్యాప్స్ నుంచి వైదొలగడంతో పాటు మైక్రోసాఫ్ట్ (Azure) నుంచి కూడా నిష్ర్కమించినట్టు ఆయన తెలిపారు. ఇతర సర్వీసులపై ఆధారపడకుండా సొంత టెక్నాలజీ వినియోగించడమే సరైనదిగా పేర్కొన్నారు.

మొత్తం రూ. 100 కోట్ల ఖర్చుతో మైగ్రేషన్ :
ఈ క్రమంలోనే గత నెలలో (Azure) నిష్క్రమించిన వెంటనే గూగుల్ మ్యాప్‌ల నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టు ఓలా పేర్కొంది. ఏడాదికి రూ. 100 కోట్లు ఖర్చుతో డేటా మొత్తం ఓలా మ్యాప్‌లకు పూర్తిగా మైగ్రేట్ చేసినట్టు తెలిపింది. ఓలా యాప్‌ని చెక్ చేసి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సరికొత్త ఫీచర్లను కూడా యాక్సస్ చేయొచ్చు. ఓలా మ్యాప్స్ ఏపీఐ @Krutrim క్లౌడ్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. స్ట్రీట్ వ్యూ, ఎన్ఈఆర్ఎఫ్ (NERF), ఇండోర్ ఫొటోలు, 3డీ మ్యాప్‌లు, డ్రోన్ మ్యాప్‌లు మొదలైనవి ఉన్నాయి.

ఓలా మ్యాప్‌లు త్వరలో అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటాయని అగర్వాల్ తెలిపారు. స్ట్రీ వ్యూ, ఇండోర్ ఫొటోలు, 3డీ మ్యాప్‌లు, డ్రోన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. ఓలా మ్యాప్స్ ఏపీఐ ఇప్పటికే కృత్రిమ్ క్లౌడ్‌లో అందుబాటులో ఉంది. అంటే.. డెవలపర్‌లు తమ సొంత యాప్‌లలో ఉపయోగించవచ్చు. వినియోగదారులకు మెరుగైన, మరింత వివరణాత్మక మ్యాప్‌లను అందిస్తుంది.

ఓలా మ్యాప్‌లను ఎలా నిర్మించిందనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ వారాంతంలో వివరణాత్మక బ్లాగ్ పోస్ట్‌ను పబ్లీష్ చేస్తామని అగర్వాల్ చెప్పారు. టెక్ ఔత్సాహికులు ఓలా మ్యాప్స్ వెనుక ఉన్న టెక్నాలజీ గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా చెప్పవచ్చు.

గూగుల్ మ్యాప్స్, అజురే నుంచి ఓలా సొంత ఓలా మ్యాప్స్‌కు మారుతున్నట్టు తెలిపింది. సొంత టెక్నాలజీ ద్వారా ఓలా డబ్బు ఆదా చేయడమే కాకుండా, ఆవిష్కరణలో తమ సత్తాను చూపుతోంది. ఓలా మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్లు, క్రుట్రిమ్ క్లౌడ్‌లో ఏపీఐ ద్వారా వినియోగదారులు భవిష్యత్తులో ఓలా సర్వీసులతో మెరుగైన ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

Read Also : Google Maps Features : గూగుల్ మ్యాప్స్ యాప్‌లో ఇంటెస్ట్రింగ్ ఫీచర్.. వాతావరణం, గాలి నాణ్యత అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు