Google Maps Save Fuel : గూగుల్ మ్యాప్స్‌‌‌లో కొత్త ఫీచర్.. ఈ నావివేగషన్‌తో మీ వెహికల్ ఇంధనాన్ని ఆదా చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Google Maps Save Fuel : గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ వెహికల్ ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇటీవలే గూగుల్ మ్యాప్స్ సర్వీసులో ఎకో ఫ్రెండ్లీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Google Maps will now help you save fuel_ Here’s how the feature works

Google Maps Save Fuel : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ అందించే సర్వీసుల్లో గూగుల్ మ్యాప్స్‌ ఒకటి.. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలన్నా మ్యాప్స్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా సులభంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అయితే, ఈ మ్యాప్స్ సర్వీసు కోసం సెర్చ్ దిగ్గజం అనేక కొత్త ఫీచర్లను చేర్చుతోంది. సాధారణంగా చాలా మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు ఎక్కువ దూరం నిలిచిపోతుంటాయి. ఇలాంటి సమాయాల్లో ఏ రూట్‌లో వెళ్లాలో వాహనదారులకు అర్థం కాదు. తద్వారా వెహికల్ ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది.

Read Also : Poco C65 Launch : అదిరే ఫీచర్లతో పోకో C65 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఇలాంటి పరిస్థితుల్లో ఇంధనాన్ని ఆదా చేసుకునేందుకు సరైన మార్గాన్ని ఎంచుకునేలా గూగుల్ మ్యాప్స్ ఒక అద్భుతమైన నావిగేషన్ ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ గో-టు యాప్ అనే ఇంధన-సేవింగ్ ఫీచర్‌. ఇప్పటికే కెనడా, యూరప్‌లలో ప్రారంభించిన ఈ ఫీచర్ భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు 2022 ప్రారంభంలో ఈ కొత్త సేవ్ ఫ్యూయల్ ఫీచర్ అగ్రదేశమైన అమెరికా, కెనడా, జర్మనీలో మాత్రమే అందుబాటులో ఉండేది. రాబోయే రోజుల్లో ఈ నావిగేట్ ఫీచర్‌ను యూరప్‌లోని మరో 40 దేశాలకు విస్తరించనున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇలా ఫీచర్ డిసేబుల్ చేయొచ్చు :
ఈ ఎకో ఫ్రెండ్లీ యాప్ ఫీచర్ మీరు ఏ మార్గంలో వెళ్తే ఇంధనం ఆదా అవుతుందో గైడ్ చేస్తుంది. అయితే, ఈ ఫీచర్ ఉపయోగించాలంటే ముందుగా వాహనదారులు తాము ఎలాంటి ఇంధనాన్ని వాడుతున్నారు అనేది తెలియజేయాల్సి ఉంటుంది. దీన్నే ఎకో ఫ్రెండ్లీ ఫీచర్ అని పిలుస్తారు. ఈ ఫీచర్ సాయంతో సమయం మాత్రమే కాదు.. డబ్బు, ఇంధనం కూడా ఆదా చేసుకోవచ్చు. కర్బన ఉద్ఘారాలను నియంత్రించడమే లక్ష్యంగా గూగుల్ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీరు వెళ్లే మార్గంలో ‘మోస్ట్‌ ఫ్యూయల్‌-ఎఫిసియెంట్‌ రూట్‌’ బ్యాడ్జ్‌ కనిపిస్తుంది. మీకు అవసరం లేదని అనిపిస్తే.. ఈ కొత్త ఫీచర్‌ను డిజేబుల్‌ చేసుకోవచ్చు. వివిధ మార్గాల్లో ఇంధనం లేదా శక్తి సామర్థ్యంపై అంచనాలను అందిస్తుంది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
గూగుల్ మ్యాప్స్‌లో ఈ కొత్త ఫీచర్ మీ వాహనం ఇంజిన్ రకానికి అనుగుణంగా వివిధ మార్గాల్లో ఇంధనం లేదా శక్తి సామర్థ్యంపై అంచనాలను అందిస్తుంది. ఫీచర్ యాక్టివేషన్ తర్వాత గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, రహదారి పరిస్థితులతో పాటు ఇంధనం లేదా ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అంతేకాదు.. వాహనం వేగం, ఇంధన సంరక్షణ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యంత అనుకూలమైన మార్గాన్ని లెక్కిస్తుంది.

Google Maps save fuel 

మార్గాలు మారినప్పటికీ, యాప్ అత్యంత ఇంధనం లేదా శక్తి-సమర్థవంతమైన ఎంపికను హైలైట్ చేస్తుంది. వేగవంతమైన మార్గాన్ని వేరు చేస్తుంది. ఈ ఫీచర్ డిసేబుల్ చేయడం వల్ల ఇంధనం లేదా శక్తి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వేగానికి ప్రాధాన్యతనిస్తూ మ్యాప్స్ నావిగేషన్ సూచిస్తుంది. అయినప్పటికీ, మీ ఇంజిన్ ఆధారిత ఇంధనం లేదా శక్తి-సామర్థ్య అంచనాలు కొనసాగుతాయని గమనించాలి. అందుకు గుర్తుగా గ్రీన్ లీవ్ ఐకాన్ ద్వారా ఫ్లాగ్ చేస్తుంది.

ఈ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే? :
* మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* మీ ప్రొఫైల్ ఫొటోను లేదా పేరును ట్యాప్ చేయండి.
* సెట్టింగ్‌లకు వెళ్లి నావిగేషన్‌పై ట్యాప్ చేయండి.
* ‘రూట్ ఆప్షన్లు’కి స్క్రోల్ చేయండి.
* ఎకో-ఫ్రెండ్లీ రూటింగ్‌ని ఆన్ చేయడానికి ‘Prefer fuel-efficient routes’ని ట్యాప్ చేయండి.
* మీ ఇంజిన్ టైప్ ఎంచుకోవడానికి ‘Engine type’ని ట్యాప్ చేసి తదనుగుణంగా ఎంచుకోండి.
* మీ గమ్యస్థానం కోసం సెర్చ్ చేయడం లేదా మ్యాప్‌లో ట్యాప్ చేయండి.
* కింది ఎడమవైపున కనిపించే డైరెక్షన్ బటన్ నొక్కండి.
* దిగువలో కనిపించే బార్‌లో పైకి స్వైప్ చేయండి.
* ‘Change engine type’ నొక్కండి. మీ వెహికల్ ఇంజిన్ ఎంచుకోండి.
* Done బటన్ ట్యాప్ చేయండి.
* మీ ఇంజిన్ టైప్ ఎంచుకోండి.

ఇంధన-సమర్థవంతమైన మార్గాన్ని దీని ఆధారంగా మార్చుకోవచ్చు. సరైన ఇంజిన్ టైప్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. డీజిల్ వాహనాలు తరచుగా హైవేలపై మెరుగ్గా పనిచేస్తాయి. అయితే, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు రిజనరేటివ్ బ్రేకింగ్ కారణంగా నగరం లేదా కొండ ప్రాంతాలలో వేగంగా వెళ్లగలవు. ఇంజిన్ రకాన్ని ఎంచుకోకపోతే.. పెట్రోల్ డిఫాల్ట్ అవుతుంది. చాలా దేశాలలో అత్యంత సాధారణ ఇంజిన్ టైప్. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) డ్రైవర్‌లకు అనేక మార్గాల్లో ఛార్జింగ్ కోసం స్టాప్‌లు ఉండవని గమనించాలి. గూగుల్ లేటెస్ట్ ఫీచర్ వినియోగదారులకు వారి గమ్యాన్ని వేగంగా చేరుకోవడమే కాకుండా మరింత ఇంధనం ఆదా చేయడంలో సాయపడుతుంది.

Read Also : Samsung Galaxy Tab S8 : అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 ఇదిగో.. కొత్త ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు