Ruppe Low : ఆల్ టైం కనిష్ఠానికి రూపాయి.. 700 పాయింట్లు దాటిన సెన్సెక్స్

Ruppe Low : స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతోంది.

Ruppe Low : స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతోంది. అమెరికా డాలర్​తో పోలిస్తే.. రూపాయి విలువ 51 పైసలు తగ్గింది. తద్వారా రూపాయి ఆల్ టైం కనిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ రూ.77.41 వద్ద కొనసాగుతోంది. యూరప్‌లో యుద్ధం, అధిక వడ్డీ రేట్ల భయంతో డాలర్‌ విలువ 77.40 దాటింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి పడిపోయింది.

భారత కరెన్సీ మార్చిలో ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 77.05 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు భారీగా బలహీనపడింది. డాలర్‌కు 77.41 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.42 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయిందని నివేదిక వెల్లడించింది. ఫ్లైట్-టు-సేఫ్టీ ట్రేడ్‌లు డాలర్ విలువను అమాంతం పెంచేశాయి. ఫెడరల్ రిజర్వ్ బెంచ్‌మార్క్ ఫండ్స్ రేటును 50 బేసిస్ పాయింట్లు, ఉద్యోగాల డేటాను పెంచిన తర్వాత డాలర్ రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరువైంది.

Rupee Hits All Time Low, Sensex Crashes 700 Points

అంతర్జాతీయ మార్కెట్లలో నెగటివ్ సంకేతాలు రావడంతో వడ్డీ రేట్ల పెంపుతో పాటు దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్​, టెక్​, ఆర్థిక రంగ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 700 పాయింట్ల దాటి నష్టాల్లోకి దిగజారింది. నిఫ్టీ 16,200 దిగువన ట్రేడవుతోంది. బాంబ్వే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​.. 800లకుపైగా పాయింట్ల నష్టంతో 54,035 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 229 పాయింట్ల నష్టంతో 16,181 వద్ద కొనసాగుతోంది. పవర్​ గ్రిడ్​, బజాజ్​ ఆటో, యూపీఎల్​, గ్రాసిమ్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, రిలయన్స్​, టీసీఎస్​, బజాజ్​ ఫైనాస్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Read Also : Stock Markets : ఆర్బీఐ నిర్ణయంతో భారీగా స్టాక్ మార్కెట్లు పతనం

ట్రెండింగ్ వార్తలు