WhatsApp Pin Chats : వాట్సాప్ యూజర్లు ఇకపై 3 మెసేజ్‌ల వరకు పిన్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!

ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభంలో పిన్ చేసే మెసేజ్‌ల సంఖ్యను ఒకదానికి పరిమితం చేసినప్పటికీ, ఇప్పుడు ఈ పరిమితిని మరింతగా విస్తరించింది. దాంతో వినియోగదారులు ఒక్కో చాట్‌కు 3 మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది.

WhatsApp Pin Chats : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. చాట్‌లలో ఒకటి కన్నా ఎక్కువ మెసేజ్‌లను ఈజీగా పిన్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభంలో పిన్ చేసే మెసేజ్‌ల సంఖ్యను ఒకదానికి పరిమితం చేసినప్పటికీ, ఇప్పుడు ఈ పరిమితిని మరింతగా విస్తరించింది. దాంతో వినియోగదారులు ఒక్కో చాట్‌కు 3 మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

వాట్సాప్ ఇప్పటికే ఒక పరిమితితో పిన్ మెసేజ్ ఫీచర్‌ను అందించింది. గత ఏడాది నుంచి మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ మల్టీ చాట్ పిన్నింగ్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫీచర్ బీటా టెస్టర్‌ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, చివరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ యూజర్లతో సహా అందరి యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. కాంటాక్ట్‌లను పిన్ చేసినట్లే.. చాట్ బాక్స్‌లో మల్టీ మెసేజ్‌లను పిన్ చేయడం వల్ల యూజర్లు ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయొచ్చు.

వాట్సాప్‌లో మల్టీ మెసేజ్‌లను ఎలా పిన్ చేయాలి? :

  • వాట్సాప్‌లో మల్టీ మెసేజ్‌‌లను పిన్ చేసే ప్రక్రియ ఒకే మెసేజ్ పిన్ చేయడం మాదిరిగానే ఉంటుంది.
  • మెసేజ్ ఎంచుకోండి.. చాట్‌లో, పిన్ చేసే మెసేజ్ నొక్కి పట్టుకోండి.
  • ‘పిన్’ ఎంచుకోండి.. ‘More Options’పై ట్యాప్ చేయండి.
  • త్రి డాట్స్ ఓవర్‌ఫ్లో మెను నుంచి ‘Pin’ ఎంచుకోండి.
  • సెట్ టైమ్ : పిన్ (24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజులు) వ్యవధిని ఎంచుకోండి.
  • ఆపై confirm ఆప్షన్ ఎంచుకోండి.

మెసేజ్ అన్‌పిన్ చేయడం ఎలా? :
పిన్ చేసిన మెసేజ్ ఎంచుకోండి..
చాట్‌లో పిన్ చేసిన మెసేజ్‌పై నొక్కి పట్టుకోండి.
‘Unpin’ ఆప్షన్ ఎంచుకోండి. ‘అన్‌పిన్’పై ట్యాప్ చేసి confirm చేయండి.

ముఖ్యంగా, వాట్సాప్ యూజర్లు వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌లలో అయినా ఒక్కో చాట్‌కు 3 మెసేజ్‌ల వరకు పిన్ చేయవచ్చు. పిన్ చేసిన తర్వాత ఎంచుకున్న మెసేజ్‌లు సమయ వ్యవధిని బట్టి 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు బ్యానర్‌గా చాట్‌లో టాప్ లిస్టులో కనిపిస్తాయి. ప్రత్యామ్నాయంగా, యూజర్ల తర్వాత పిన్ మెసేజ్ గుర్తించేందుకు స్టార్ కూడా వేయవచ్చు, ఇది ఎన్ని మెసేజ్‌లకు స్టార్ ఉంచాలనే దానిపై పరిమితి లేదు.

మెసేజ్ మొత్తానికి కనిపించేలా కాకుండా వ్యక్తిగత యూజర్లకు మాత్రమే యాక్సెస్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అదే సమయంలో, గ్రూప్ చాట్‌లలోని సభ్యులు మెసేజ్‌లను పిన్ చేయవచ్చో లేదో గ్రూప్ అడ్మిన్‌లు కంట్రోల్ చేయొచ్చు.‘Group Settings’కి నావిగేట్ చేయడం ద్వారా ‘Edit Group Settings’ ఆప్షన్ ఎడిట్ చేయడం ద్వారా అడ్మిన్లు మెసేజ్‌లను పిన్ చేసే సభ్యులకు అనుమతించగలరు. లేదంటే నిలిపివేయగలరు.

అలాగే, గ్రూప్ చాట్‌లో మెసేజ్ పిన్ చేస్తే.. ఒక సిస్టమ్ మెసేజ్ పాల్గొనే వారందరితో షేర్ అవుతుంది. యూజర్ రిప్లయ్‌తో పాటు మెసేజ్ ఎవరు పిన్ చేసారో సూచిస్తుంది. అయితే, మెసేజ్‌ని పిన్ చేసిన తర్వాత గ్రూప్‌లో చేరిన కొత్త సభ్యులు లేదా వారి చాట్ హిస్టరీని క్లియర్ చేసిన వారికి పిన్ చేసిన మెసేజ్ కనిపించకపోవచ్చు. అదనంగా, పిన్ వ్యవధి ముగిసేలోపు పిన్ చేసిన మెసేజ్ డిలీట్ అయితే పిన్ ఆటోమాటిక్‌గా రిమూవ్ అవుతుంది.

Read Also : Sundar Pichai : బిలియనీర్ కాబోతున్న సుందర్​ పిచాయ్​.. గూగుల్ సీఈఓ నికర సంపద 100 కోట్ల డాలర్లకు చేరువగా!

ట్రెండింగ్ వార్తలు