WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

మెసేజింగ్ యాప్ ఇప్పుడు మీరు వాడే ఐఫోన్ మోడల్‌ను బట్టి ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని ఉపయోగించి ఐఫోన్ పాస్‌కీలకు సపోర్టు ఇస్తుంది.

WhatsApp iPhone Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎట్టకేలకు పాస్‌కీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇకపై మీరు పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీ వాట్సాప్ అకౌంట్‌ను పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయవచ్చు. మెసేజింగ్ యాప్ ఇప్పుడు మీరు వాడే ఐఫోన్ మోడల్‌ను బట్టి ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని ఉపయోగించి ఐఫోన్ పాస్‌కీలకు సపోర్టు ఇస్తుంది.

Read Also : WhatsApp Green Colour : మీ వాట్సాప్ గ్రీన్‌‌ కలర్‌లోకి మారిందా? ఈ మార్పునకు కారణమేంటి? యూజర్ల రియాక్షన్ ఇదిగో!

ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ యూజర్లు గత ఏడాది అక్టోబర్‌లో పాస్‌కీలను పొందారు. ఇప్పుడు ఐఫోన్ యూజర్లు కూడా పాస్‌కీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ సెట్టింగ్‌లలో ఆప్షన్ అందుబాటులో ఉన్నప్పుడు వాట్సాప్ ఐఓఎస్ అప్‌డేట్ త్వరలో రిలీజ్ చేయనుంది.

పాస్‌కీల ద్వారా వాట్సాప్ ప్రొటెక్షన్ : ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే? :
పాస్‌కీలు ప్రాథమికంగా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌లో ఎస్ఎంఎస్ ద్వారా పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్‌తో కూడిన ట్రేడేషనల్ లాగిన్ ఛానెల్‌లను యాక్సస్ చేసేందుకు అనుమతిస్తాయి. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌లో ఎనేబుల్ చేసేందుకు మీ ఐఫోన్‌లో ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ఫీచర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

పాస్‌కీలను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటంటే.. హ్యాకర్‌లు మీ వాట్సాప్ డేటాను రిమోట్‌గా యాక్సెస్ చేయలేరు. అందుకు మీ బయోమెట్రిక్ వివరాలు తప్పక అవసరం. ఐఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లో పాస్‌కీలను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.

  • వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
  • అకౌంట్‌పై క్లిక్ చేయండి
  • పాస్‌కీలకు వెళ్లండి
  • పాస్‌కీ (Passkey)లను క్రియేట్ చేయండి.
  • Continue ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • డివైజ్ కోసం స్క్రీన్ లాక్‌ తర్వాత పాస్‌కీని క్రియేట్ చేయొచ్చు

వాట్సాప్ అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేదు. కానీ, వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ ఇతర యూజర్లతో ఆఫ్‌లైన్‌లో ఫైల్‌లను షేర్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి కాంటాక్ట్‌లు లేనివారికి కూడా కాల్ చేసేందుకు అనుమతించే వాట్సాప్ యాప్‌లో డయలర్ ఫీచర్ వంటి కొన్ని ఫీచర్‌లను అందిస్తోంది.

Read Also : WhatsApp Exit India : యూజర్ల మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ బ్రేక్ చేస్తే.. భారత్ నుంచి నిష్ర్కమిస్తాం : వాట్సాప్ వెల్లడి!

ట్రెండింగ్ వార్తలు