BJP Leader Sana Khan Case : బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య కేసులో భర్త అమిత్ సాహు అరెస్ట్ ..

భర్త అని నమ్మి వెళితే చంపి నదిలో పారేశాడు. బీజేపీ మహిళా నేత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహం జరిగిన ఆరు నెలలకే భార్యను హత్య చేసిన దారుణం మహారాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది.

BJP Leader Sana Khan assassinated case

BJP Leader Sana Khan assassinated case : నాగ్ పూర్ బీజేపీ నాయకురాలు సనాఖాన్ (BJP Leader Sana Khan)అదృశ్యమై పది రోజులు అయ్యింది. ఈక్రమంలో పోలీసులు ఆమె భర్త అమిత్ సాహు(Amit Sahu )ను శుక్రవారం (ఆగస్టు 11,2023) పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్య సనాఖాన్ ను తానే హత్య చేశానని అంగీకరించటంతో నాగ్ పూర్ పోలీసులు అమిత్ సాహును అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్ పూర్ (Jabalpur)లో ఆమెను హత్య చేసానని అంగీకరించటంతో నాగ్ పూర్ పోలీసులు (Nagpur Police)అమిత్ సాహుతో పాటు జబల్ పూర్ లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.అమిత్ ను విచారించగా సనాను హత్య చేసి నదిలోపారేశానని తెలిపాడు.

Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసి మహిళను హత్యచేసి దుండగులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమిత్ సాహు ఎమ్మెల్యే సనాఖాన్ ను హత్య చేసి హిరాన్ నదిలోపారేశాడు. మృతదేహం కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కానీ ఇప్పటికీ లభ్యం కాలేదని తెలిపారు. నిందితులను సనాను హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లగా మృతదేహాన్ని ఎక్కడ పారేశాడు అనే విషయం అమిత్ తెలిపాడు. పోలీసులు సనా మృత‌దేహం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

నాగ్‌పూర్‌లోని మనక్‌పూర్ ప్రాంతానికి చెందిన సనాఖాన్.. బిల్హరిలో నివాసముంటున్న ధాబా నిర్వాహకుడు అమిత్ సాహు అలియాస్ పప్పుని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.ఆగస్టు 1న సనా ఖాన్ జబల్ పూర్ వెళుతున్నామని తన తల్లికి చెప్పి బయలుదేరింది. ఆగస్ట్ 2న సనా బంధువు ఇమ్రాన్‌కు ఫోన్ చేసి జబల్‌పూర్‌కు చేరుకునే విషయాన్ని తెలియజేసింది. అదే రోజు సాయంత్రం ఇమ్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. భర్త తనను దారుణంగా కొట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ఇమ్రాన్.. సనా తల్లికి చెప్పాడు.

దీంతో వారు ఆందోళన చెందారు. అప్పటినుంచి సనా కనిపించకుండాపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె భర్తపై అనుమానం వచ్చిన పోలీసులు అమిత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసి నదిలో పారేశానని తెలిపాడు. దీంతో సనా మృతదేహం కోసం పోలీసులు నదిలో గాలిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు