దేశవ్యాప్తంగా ఉన్న IIT, NIT తో పాటు ఇతర విద్యా సంస్థల్లో M-TECH, PHD కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 2, 3, 9, 10 తేదీల్లో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ (GATE) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, రెండో దశ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
అరగంట ఆలస్యం అయిన అనుమతి:
పరీక్షకు విద్యార్థులు అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పరీక్షకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.30 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది.
మొత్తం 24 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు తెలంగాణ నుంచి దాదాపు 80 వేలకుపైగా విద్యార్థులు హాజరవుతారు. ఈ పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో బాపట్ల, చీరాల, గూడురు, గుంటూరు, కడప, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొల్లం, కొత్తగూడెం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, వరంగల్, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫలితాలను మార్చి 16న విడుదల చేయనున్నట్లు IIT మద్రాస్ పేర్కొంది.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలకా్ట్రనిక్ వస్తువులు, వాచీలు, క్యాలిక్యులేటర్లు తీసుకురాకూడదు. ఫుల్ షర్ట్స్, షూస్ ధరించకూడదు. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో ఐడీ తీసుకురావాల్సి ఉంటుంది.