Earthquake In Turkey : వరుస భూకంపాలు టర్కీ, సిరియాను బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం సంబవించిన భూకంపం నుంచి ఇప్పటికి తేరుకోలేకపోతున్న టర్కీని మరో భూకంపం వణికించింది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైంది. అక్కడి స్థానికులు భయాందోళనలో ఉన్నారు. టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. సహయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలను తొలగించే కొద్దీ మృతుల సంఖ్య అక్కడ పెరుగుతూనే పోతుంది.
భారీ భూకంపంతో మరో భూమిగా మారిన టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 33కు పైబడింది. టర్కీలో ఇంతవరకు 29,606 మంది చనిపోగా, సిరియాలో 3,576 మంది మృత్యువాతపడ్డారు. ఈ రెండు దేశాల్లో సంఖ్య 50వేలు దాటేస్తుందని ఐక్యరాజ్య సమితి సహాయక కార్యక్రమాల విభాగాధిపతి మార్టిన్ గ్రిప్లిక్స్ తెలిపారు. భూకంపం ధాటికి టర్కీలో 88 వేల మంది క్షతగాత్రులు అయ్యారు. సిరియాలో 12 వేల మంది తగాత్రులు అయ్యారు. సిరియాలో 50 లక్షలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకుని కొన ఊపరితో ఉన్నవారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు.
Turkey Syria Earthquake : టర్కీ, సిరియాల్లో 34వేలకు చేరిన మృతుల సంఖ్య .. పెరుగుతున్న నేరాలు
రోజులు గడిచే కొద్ది ఆకలి దప్పులు తీర్చుకోలేక నీరిసించిపోవడంతో శిథిలాల కిందే తుది శ్వాస విడుస్తున్నారు. ఇప్పటికే సమయం మించిపోవడంతో ప్రాణాలతో ఉన్న కొద్ది మందినైనా రక్షించాలనే తాపత్రయం రెస్క్యూ టీమ్ యుద్ధ ప్రాతిపదికన రేయింబవళ్లు పని చేస్తున్నాయి. హతాయి ప్రావిన్స్ లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ గర్బిణీని ఆదియామాన్ నగరంలో ఆరేళ్ల బాలున్ని, మరో బాలికను 150 గంటల తర్వాత రెస్క్యూ టీమ్ రక్షించాయి. అంటార్కియాలో 35 ఏళ్ల వ్యక్తిని 149 గంటల తర్వాత కాపాడారు. కిరిఖాన్ నగరంలో 88 ఏళ్ల వృద్ధురాలిని ప్రశ్నించారు.
శిథిలాల కింది చిక్కుకున్న వారిని గుర్తించేందుకు థర్మాల్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక భారత్ సహా పలు దేశాల నుంచి వెళ్లిన రెస్క్యూ టీమ్ వణికించే చలిలో కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. శిథిలాను వెలికి తీసే కొద్ది వందల మృతేహాలు బయటకు వస్తున్నాయి. మృతదేహాలను సామూహింకగా ఖననం చేస్తున్న దృశ్యాలు టర్కీ, సిరియా వాసులను కంటతడి పెట్టిస్తున్నాయి.