Turkey Syria Earthquake : టర్కీ, సిరియాల్లో 34వేలకు చేరిన మృతుల సంఖ్య .. పెరుగుతున్న నేరాలు

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే స్వల్ప భూప్రకంపనలే కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇరు దేశాల్లో భూకంపం సంభవించి వారం రోజులు అవుతుంది. కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. పలువు ప్రాణాలతో బయటపడుతున్నారు.

Turkey Syria Earthquake : టర్కీ, సిరియాల్లో 34వేలకు చేరిన మృతుల సంఖ్య .. పెరుగుతున్న నేరాలు

Turkey Syria Earthquake

Turkey Syria Earthquake : టర్కీ, సిరియాలో భూకంప ప్రభావంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. భూకంపం తీవ్రతకు కుప్పకూలిన భవనాల శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పటికే 34వేల మంది మరణించినట్లు స్థానిక అధికారులు గుర్తించగా, ఈ సంఖ్య 50వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భవనాల శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల్లో సంభవించిన భూకంపం కారణంగా 80వేల మంది క్షతగాత్రలుగా మారారు. వారికి స్థానిక ఆస్పత్రుల్లో, ప్రత్యేక హెల్త్ క్యాంపుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. టర్కీలో భవనాల శిథిలాల కింద గుర్తించిన మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి. మరోవైపు, భూకంపం సంభవించి వారం రోజులు అవుతున్నా.. నేలకూలిన భవనాల శిథిలాల తొలగింపు నత్తనడకన కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది.

Turkey-Syria Earthquake: సహాయక చర్యల్లో అద్భుతం.. ఆ ఐదుగురిని కాపాడేశారు

ఇదిలాఉంటే టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే స్వల్ప భూప్రకంపనలే కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులు అవుతున్నా.. శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. టర్కీలో ఓ రెండు నెలల చిన్నారిని 128 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు. అయితే, సహాయక చర్యలు మరింత వేగంగా చేపడితే మరణాల సంఖ్య కొంతమేరైనా తగ్గేదన్న వాదన వినిపిస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల సహాయక సిబ్బంది వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. యూఎన్ రిలీఫ్ అండ్ రెస్క్యూ టీంలు కూడా సిరియా, టర్కీ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Turkey-Syria Earthquake: పసిగుడ్డు ఏడుపు.. 90 గంటల తరువాత శిథిలాల్లోంచి 10రోజుల పసిబిడ్డతో బతికి బటయపడ్డ తల్లి

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఆర్థిక సహాయం అందించేందుకు యూఎన్ హామీ ఇచ్చింది. మరోవైపు సిరియాలో భూకంపం తర్వాత దోపిడీలు, నేరాలు భారీ పెరిగాయి. దోపిడీ ఆరోపణల నేపత్యంలో 48మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. టర్కీ, సిరియాల్లో దాదాపు 9లక్షల మందికి ఆహారం అవసరమని ఐరాస తెలిపింది. దాదాపు 32వేల మంది ప్రజలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని టర్కీ విపత్తు ఏజెన్సీ తెలిపింది. ఇందులో 10వేల మంది ఇతర దేశాలకు చెందిన వారు. టర్కీ, సిరియాల్లో భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది రాత్రిపగలు అనే తేడాలేకుండా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కృషిచేస్తున్నారు.