Home » Turkey Syria Earthquake
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే స్వల్ప భూప్రకంపనలే కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇరు దేశాల్లో భూకంపం సంభవించి వారం రోజులు అవుతుంది. కూలిన భవనాల శిథిలాల కింద చిక్�
భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాలో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచింది. శిథిలాల నుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం కొంత ఊరటనిస్తోంది.
Turkey-Syria Earthquake: తీవ్ర భూకంపంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన టర్కీ-సిరియా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో శవాల గుట్టలే కాదు, శిథిలాల కింద ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారూ కనిపిస్తున్నాయి. రోజుల పసికందు నుంచి పండు ముసలి �
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల
అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్(17) అనే బాలుడు 4 రోజుల తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, 94 గంటల పాటు తాను నరకయాతను అనుభవించానని ఆ కుర్రాడు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రం తాగి బతికానని తెలిపాడు.
టర్కీ, సిరియా భూకంప శిథిలాల్లోంచి చిన్నారులు మృత్యుంజయులుగా బయపటడుతున్నారు. ఈక్రమంలో ఆకలితో ఏడ్చిన పసిగుడ్డు ఏడుపు తల్లీ బిడ్డలు భూకంప శిథిలాల నుంచి బయపటపడేలా చేసింది. 90 గంటల తరువాత శిథిలాల్లోంచి 10రోజుల పసిబిడ్డతో బతికి బటయపడింది తల్లి.
శిథిలాల కింద ఎవరైనా బతికున్నారేమో అన్న ఆశ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇలా అనుకున్న ప్రతీసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ‘మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం’ అన్నట్లుగా మృత్యువును ఓడించి కంటబడుతన్నారు.
టర్కీ, సిరియాలో ప్రకృతి ప్రకోపానికి చనిపోయిన వారి సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 9వేల 600గా ఉంది.
టర్కీలో భూప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు వందసార్లకు పైగా భూమి కంపించింది. నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడం లేదు. రిక్టర్ స్కేల్ పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో వందసార్లకు పైగా భూమి కంప�
భూకంపం ధాటికి టర్కీ, సిరియా కకావికలం అయ్యాయి. ఎటు చూసినా కూలిన బిల్డింగ్ లే దర్శనం ఇస్తున్నాయి. హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తన్నాయి. ఇది చాలదన్నట్టు టర్కీ ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. భూకంపం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.