Turkey-Syria Earthquake: సహాయక చర్యల్లో అద్భుతం.. ఆ ఐదుగురిని కాపాడేశారు

Turkey-Syria Earthquake: సహాయక చర్యల్లో అద్భుతం.. ఆ ఐదుగురిని కాపాడేశారు

Smiles, Tears, Cries As Family Of 5 Rescued From Syria Quake Rubble

Turkey-Syria Earthquake: తీవ్ర భూకంపంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన టర్కీ-సిరియా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో శవాల గుట్టలే కాదు, శిథిలాల కింద ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారూ కనిపిస్తున్నాయి. రోజుల పసికందు నుంచి పండు ముసలి వరకు అక్కడక్కడా ప్రాణాలతో కనిపిస్తున్నారు. ఇంతటి విధ్వంసం, తీవ్ర నిరాశ నడుమ ఆశలు చాలించుకున్న భూకంప ప్రాంతంలో ఇలాంటి ఘటనలు కొత్త ఆశను, ఊరటనూ ఇస్తున్నాయి.

Bharat Jodo Yatra: యాత్ర నుంచి తప్పుకోనున్న రాహుల్ గాంధీ.. కారణమేంటో తెలుసా?

ఇక తాజాగా సిరియాలో కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఒక అద్భుతం వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు ఇలా కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపల్లేదు. కాగా పశ్చిమ ఇద్లిబ్ ప్రాంతంలోని బిస్నియా గ్రామానికి చెందిన కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడటం గమనార్హం. దీంతో సహాయక బృందాలతో పాటు స్థానికులు ఆనందంతో అరిచారు, ఏడ్చారు.. కన్నీళ్లతో తమ అనుభూతిని తెలియజేశారు. కుటుంబంలోని ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దల్ని శిథిలాల నుంచి బయటికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సహాయక బృందాలు పిల్లలను అంబులెన్స్‌లోకి తీసుకువెళుతున్న దృశ్యాలు వీడియోలో చూడొచ్చు. కుప్పకూలిన భవనం నుంచి బయటికి తీసిన పెద్దలను కూడా స్ట్రెచర్లపై తీసుకువెళుతున్నారు. సోమవారం నాటి 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 28,000 మందికి పైగా మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.