Turkey-Syria Earthquake: పసిగుడ్డు ఏడుపు.. 90 గంటల తరువాత శిథిలాల్లోంచి 10రోజుల పసిబిడ్డతో బతికి బటయపడ్డ తల్లి

టర్కీ, సిరియా భూకంప శిథిలాల్లోంచి చిన్నారులు మృత్యుంజయులుగా బయపటడుతున్నారు. ఈక్రమంలో ఆకలితో ఏడ్చిన పసిగుడ్డు ఏడుపు తల్లీ బిడ్డలు భూకంప శిథిలాల నుంచి బయపటపడేలా చేసింది. 90 గంటల తరువాత శిథిలాల్లోంచి 10రోజుల పసిబిడ్డతో బతికి బటయపడింది తల్లి.

Turkey-Syria Earthquake: పసిగుడ్డు ఏడుపు.. 90 గంటల తరువాత శిథిలాల్లోంచి 10రోజుల పసిబిడ్డతో బతికి బటయపడ్డ తల్లి

Turkey-Syria Earthquake..10 Day Old Baby and His Mother Rescued

Turkey-Syria Earthquake: టర్కీ, సిరియా భూకంప శిథిలాల్లోంచి చిన్నారులు మృత్యుంజయులుగా బయపటడుతున్నారు. భూకంప శిథిలాల్లోనే బిడ్డను ప్రసవించి తల్లి చనిపోగా శిథిలాలు చేసిన గాయాల నుంచి అప్పుడే పుట్టిన పసిగుడ్డు ప్రాణాలతో బయపడిన దశ్యాలను చూశారు. మరోచోట మరో పసిపాపను రెస్క్యూటీమ్ కాపాడింది. ఇలా ఒక్కొక్కరుగా శిథిలాల నుంచి ప్రాణాలతో బయపడుతున్నారు చిన్నారులు. ఈక్రమంలో హతయ్ ప్రావిన్సులో ఓ బిల్డింగ్ శిథిలాల కింది దాదాపు 90 గంటల తరువాత ఓ పసిబిడ్డ ఏడుపు తల్లీ బిడ్డల్ని కాపాడేలా చేసింది. భూకంప శిథిలాల్లో తన పసిగుడ్డుతో పాటు చిక్కుకుపోయింది ఓ మహిళ. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 90 గంటలపాటు 10రోజుల పసిగుడ్డుతో పాటు శిథిలాల్లోనే చిక్కుకుపోయిందామె. శిథిలాల్లో చిక్కుకున్నతర్వాత 90 గంటలకు ఆ తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు.

Turkey,Syria Earthquake : భూకంప శిథిల్లాల్లో పుట్టిన పసిబిడ్డకు ‘అయా’అని పేరు పెట్టిన డాక్టర్..‘అయా’అంటే అర్థం ఎంత ‘అద్భుతం’గా ఉందో..!!

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అలర్టయ్యారు. వెంటనే ఆ దిశగా పరుగులు తీసి జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తూ పసికందు దగ్గరికి చేరుకున్నారు. బాబుతో పాటు తల్లిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నాలుగు రోజులు చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. శిథిలాల్లోనే చిక్కుకుపోయినా తల్లి వద్ద పాలు తాగుతున్న బాబు చురుగ్గానే ఉన్నాడు. కానీ తల్లి మాత్రం తిండి, నీరు లేక నీరసించిపోయింది. రెస్క్యూటీమ్ ఆమెను సురక్షితంగా డాక్టర్లకు అప్పగించటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అలా ఆమె ఆ శిథిలాల్లోనే మరో ఒకటి రెండు రోజులు ఉంటే ఆమె ప్రాణాలు ఏమయ్యేవో అమ్మపాలు కూడా లేక ఆ బిడ్డ కూడా ఏమయ్యేవాడో అని తలచుకోవటానికి భయపడ్డారు రెస్క్యూ సిబ్బంది.

Syria earthquake : సిరియా భూకంప శిథిల్లాల్లోనే ప్రసవం .. బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మహిళ

అన్ని గంటల తరవాత బిడ్డ ఏడుపు ఆ తల్లీ బిడ్డల్ని రక్షించింది. అమ్మకు తిండిలేక అమ్మ దగ్గర కూడా పాలు అడుగంటిపోవటంతో ఆ పసిబిడ్డ ఆకలితో ఏడ్చిన ఏడుపు ఆ తల్లీ బిడ్డలు ప్రాణాలతో బయపడేలా చేసింది.స్పృహలేని పరిస్థితుల్లో బయటపడిన తల్లికి చికిత్సనందిస్తున్నారు. బిడ్డ బాగానే ఉన్నాడని తల్లి కోలుకుని తల్లిపాలు తాగితే బాబు ఆరోగ్యం బాగుంటుందంటున్నారు డాక్టర్లు.

కాగా టర్కీ, సిరియాలలోఫిబ్రవరి (2023) 6న పెను భూకంపం సంభవించింది. రెండు దేశాల్లో భారీగాన విధ్వంసంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. టర్కీ, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 25 వేలు దాటింది.

Turkey Earthquake : టర్కీ శిథిలాల్లో గుండెల్ని బరువెక్కించే దృశ్యం..పసిప్రాణాన్ని కాపాడామనే ఆనందంతో చిన్నారిని ముద్దాడిన రెస్క్యూ టీమ్