Syria earthquake : సిరియా భూకంప శిథిల్లాల్లోనే ప్రసవం .. బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మహిళ

సిరియా భూకంప శిథిల్లాల్లోనే బిడ్డను ప్రసవించిందో మహిళ..బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో విషాద ఘటనలకు భూకంప శిథిలాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లులు, తల్లులను కోల్పోయిన బిడ్డలు ఇలా ఎన్నో విషాదగాధలు కన్నీరు పెట్టిస్తున్నాయి.

Syria earthquake : సిరియా భూకంప శిథిల్లాల్లోనే ప్రసవం .. బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మహిళ

Women gives birth to baby under Syria earthquake

Women gives birth to baby under Syria earthquake : చావు పుట్టుక ఎలా సంభవిస్తాయో ఎవ్వరికి తెలియదు. ‘కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం’. ఈ మాట వెనుక ఉన్న అంతరర్ధాన్ని తెలుసుకోవటం మానవమాత్రులకు సాధ్యం కాదు. ప్రకృతి విలయ తాండవం చేస్తున్నా ఈ జనన మరణాలకు సంబంధంలేదు. అటువంటి ఓ హృదయ విదారక ఘటనకు వేదికైంది సిరియాలోని భూకంప దుర్ఘటన. ఓ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది ఓ తల్లి. సిరియా భూకంప శిథిలాలు ఓ పుట్టుకకు వేదికైతే మరో మరణానికి కూడా సజీవ సాక్ష్యంగా నిలిచాయి.

లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమనే ఘటన చోటుచేసుకుంది భూకంపంతో అల్లాడుతున్న సిరియాలో. ఓ పక్క శవాల గుట్టలు. మరోపక్క అప్పుడే ఈ భూమ్మీదకు వచ్చిన ఓ శిశువు. కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో ఆ లయకారకుడు.. సిరియా భూకంప శిథిలాల కిందే బిడ్డను ప్రసవించింది. బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిందో తల్లి. ఓ బిడ్డ ఈ లోకంలోకి వస్తే మరో ప్రాణం అనంతవాయువుల్లో కలిసింపోయింది.

టర్కీ, సిరియాలో ఎటు చూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఎంతటి కఠినాత్ములకైనా కన్నీరు తెప్పిస్తున్నాయి.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ బిడ్డ ఈ భూమ్మీదకు వచ్చింది.

సిరియా అలెప్పోలో ఓ తల్లి భూకంప శిథిలాల్లోనే బిడ్డకు జన్మినిచ్చింది. మరింత విషాదం ఏమిటంటే ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది.