Most Expensive Tea: కప్పు చాయ్ రూ.లక్షల్లోనే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘టీ’లు ఇవే..!

ఉదయం లేవగానే మంచి టీ లేదా కాఫీ పొట్టలో పడకపోతే మనలో చాలా మందికి అసలు రోజు మొదలుకాదు. తాగే కప్పు, టీలో కలిసే పదార్ధాలలో వారి స్థోమతను బట్టి మార్పులు ఉంటాయేమో కానీ అందులో టీ మాత్రం ఒక్కటే.

Most Expensive Tea: ఉదయం లేవగానే మంచి టీ లేదా కాఫీ పొట్టలో పడకపోతే మనలో చాలా మందికి అసలు రోజు మొదలుకాదు. తాగే కప్పు, టీలో కలిసే పదార్ధాలలో వారి స్థోమతను బట్టి మార్పులు ఉంటాయేమో కానీ అందులో టీ మాత్రం ఒక్కటే. అయితే.. రుచిలో మార్పు కోసం అందులో వాడే పదార్ధాలలో మార్పు ఉన్నట్లే.. టీ పొడి లభించే ప్రాంతాలు.. దాని సేకరణ.. సాగు.. శుద్ధి విధానంలో మార్పులతో కలిసి దాని ధరలలో కూడా మార్పులు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ కప్పు టీ ఖరీదు రెండు రూపాయల నుండి లక్షల వరకు ఉంటుంది. అయితే.. అసలు ప్రపంచంలో అంత ఖరీదైన టీలు ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటి? ఎందుకంత ఖరీదు అన్నది ఇప్పుడు చూద్దాం..

1. Da-Hong Pao Tea

Most Expensive Tea

డా హాంగ్ పావో టీ ఫుజియాన్ ప్రావిన్స్ యొక్క వుయ్ పర్వతాలలో పండించే వివిధ రకాల టీలలో ఒకటి. ఇది చాలా ఆక్సీకరణంగా ముదురు రంగులో ఉంటుంది. మింగ్ రాజవంశం (1368-1644) చక్రవర్తి తల్లి డా హాంగ్ పావోకు ఈ ఆకుల ద్వారానే జబ్బు నయమైందని పురాణ కథనం. చైనీస్ మూలాలకు చెందిన ఈ టీ వసంతకాలంలో పండిస్తారు. ఇది 600 మీటర్ల ఎత్తులో శుభ్రమైన పర్వత గాలి, ప్రత్యేక వాతావరణం ఈ టీ ఆకుల ఆరోగ్యకరమైన, రుచి లక్షణాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. డా హాంగ్ పావో టీను ప్రభావం మెరుగైన కిణ్వ ప్రక్రియ, దీర్ఘకాలం ఎండబెట్టడం ద్వారా ప్రత్యేకమైన వాసన మరియు ప్రకాశవంతమైన రుచిని కలిగి ఉంటుంది.

ధర: ఒక గ్రాము టీ పౌడర్ సుమారు రూ.30,000, లేదా ఒక కుండ సుమారు రూ.7,30,000.

2. PG Tips Diamond Tea Bag

Most Expensive Tea

ఈ టీ బ్యాగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. పిజి టిప్స్ కంపెనీ వారు 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ టీ బ్యాగ్ ని పదివేల డాలర్స్ ఖర్చుపెట్టి తయారుచేశారు. అయితే ఇంత ఖరీదైన టీ బ్యాగ్ లో 280 వజ్రాలను ఉపయోగించారు. ఈ డైమండ్ టీ బ్యాగ్ ని తయారు చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేమిటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ కి ఫండ్ జనరేట్ చేయడం కోసం దీన్ని అమ్మగా వచ్చిన డబ్బులను ఆ పిల్లలకు ఖర్చు పెట్టాలి అని అనుకున్నారు. కాగా, ఈ ప్రత్యేక పరిమిత ఎడిషన్ డైమండ్ టీ బ్యాగ్‌ 280 వజ్రాలతో నిండి ఉంది.

ధర: ఒక బ్యాగ్ సుమారు రూ.11,00,000

3. Panda Dung Tea

Most Expensive Tea

పాండా డంగ్ టీ.. అంటే పాండాల విసర్జనతో తయారుచేసే టీ అనమాట. ఔను మీరు చదివింది నిజమే.. పాండాల పేడతో సైతం టీని తయారు చేస్తున్నారు. సాధారణంగా పాండాలు వెదురు మొక్కలను తింటాయి. ఈ నేపథ్యంలో పాండాలు విసర్జించే పేడలో అత్యధిక పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అప్పటి నుంచి పాండాల విసర్జనతో గ్రీన్ టీలను తయారు చేస్తున్నారు. ఈ పాండా టీ ప్యాకెట్ విలువ లక్షలలోనే ఉంటుంది. ఈ పాండా డంగ్ టీ ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన టీలలో ఒకటి పేరుతెచ్చుకుంది.

ధర: 50 గ్రాములకు రూ .2.5 లక్షలు

4. Vintage Narcissus

Most Expensive Tea

వింటేజ్ నార్సిసస్ అనేది ప్రపంచంలో అరుదైన టీలలో ఒకటి, ఇది పూలు, కలప, చాక్లెట్ కలగలిసిన అందమైన కాంబినేషన్ లో రూపొందే టీ కనుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. నార్సిసస్ అనేది మొగ్గ, ఆకుల వాస్తవ రుచులను పొందడానికి 60% వరకు ఆక్సీకరణం చెందుతాయి. అందమైన యువత అని దీని పేరుకు తగ్గట్లే ఇది ఎక్కువగా యువతనే ఆకట్టుకుంటుంది.

5. Yellow Gold Buds

Most Expensive Tea

సింగపూర్‌లో దొరికే అరుదైన టీలలో ఈ యెల్లో గోల్డ్ టీకు ఎంతో ప్రత్యేకత ఉంది. కేవలం ఇక్కడ మాత్రమే పండించే ఈ టీ ఆకులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కత్తిరించి టీ పొడిగా మారుస్తారు. కాగా, తేలికపాటి తినదగిన 24 క్యారెట్ల బంగారంతో ఈ టీ పూసినట్లుగా అనుభూతినిస్తుంది.

ధర: కిలోగ్రాము సుమారు రూ.4,74,000

6. Silver Tips Imperial Tea

Most Expensive Tea

డార్జిలింగ్ లో లభించే ఈ సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ ప్రతి సంవత్సరం పరిమిత పరిమాణంలో ఇండియాలో తయారు చేయబడుతుంది. పూర్తిగా చేతితో సెమీ-పులియబెట్టిన పద్దతిలో ఈ టీ తయారు చేస్తారు. లాంగ్ పాసెస్ లో చేసి ఈ టీ కొంత వెండి రంగులో ఉండగా ప్రత్యేకమైన సుగంధం, ఆకృతి, మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది ఇతర టీలకు భిన్నంగా ఉంటుంది. పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మాత్రమే ఈ ఆకులను తెంచడం జరుగుతుందని చెప్తారు.

ధర: కిలో సుమారు 30,000కు అమ్ముతారు

7. Manohari Gold Tea

Most Expensive Tea

మన దేశంలో ఎక్కువగా అస్సాంలో విక్రయించబడే మనోహరి గోల్డ్ టీ ఇండియాలోని అత్యుత్తమ రెండవ-ఫ్లష్ కల్నల్ టీ మొగ్గల నుండి తయారైన అరుదైన టీలలో ఒకటి. దాని అసలు నాణ్యతను నిలుపుకోవటానికి కారణం దీనిని పూర్తిగా చేతితోనే తయారుచేస్తారు. సూర్యోదయాలకు ముందు తెల్లవారుజామున ఈ టీ ప్రాసెస్ పూర్తిచేయడంతోనే ఈ మనోహరి గోల్డ్ టీకు ప్రత్యేకత వచ్చినట్లుగా చెప్తారు.

ధర: 2020లోనే కిలో 75,000 రూపాయల రికార్డు ధరకు అమ్ముడైంది

 

ట్రెండింగ్ వార్తలు