విజయవాడ డాక్టర్ ఫ్యామిలీ డెత్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం. 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ తో మాకు మంచి అనుబంధం ఉంది. 

Vijayawada Doctor Family: విజయవాడలో డాక్టర్ శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య, తల్లి సహా ఇద్దరు పిల్లల్ని హత్య చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులందరికీ మొదట మత్తు ఇచ్చిన శ్రీనివాస్.. మత్తులో ఉండగా మెదడుకు బ్లడ్ తీసుకెళ్లే ప్రధానమైన నరాన్ని కట్ చేసినట్టు గుర్తించారు. మత్తులోనే నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.

డాక్టర్ శ్రీనివాస్ ఏడాది క్రితం విజయవాడ కస్తూరిబాయిపేటలో శ్రీజ హాస్పిటల్ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్మాణానికి సొంత ఆస్తులు అమ్మడంతో పాటు బ్యాంకుల నుంచి భారీ ఎత్తున లోన్లు తీసుకున్నారు. ఊహించిన స్థాయిలో హాస్పిటల్ నడవకపోవడంతో దాన్ని వేరొకరికి విక్రయించారు. హాస్పిటల్ అమ్మినా అప్పులు తీరకపోవడంతో డాక్టర్ శ్రీనివాస్ డిప్రెషన్ లో ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో ఎంజే నాయుడు, విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆయన పనిచేశారు. శ్రీనివాస్ తండ్రి డీఎస్పీగా పనిచేశారు.

ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాం
డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని, ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని ఆయన స్నేహితుడు భగవాన్ 10టీవీతో చెప్పారు. ”శ్రీనివాస్ చాలా సౌమ్యుడు. సంవత్సరం క్రితం సొంతంగా శ్రీజ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం సక్రమంగా నిర్వహించాడు. తర్వాత హాస్పిటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైయ్యాయి. నెలకు 20 నుంచి 30 లక్షల రూపాయలు ఎదురు పెట్టుబడి పెట్టాడు. 2 నెలల క్రితం తన స్నేహితుల వద్ద తాను సూసైడ్ చేసుకుంటానని చెప్పాడట. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే అతడు చనిపోయాడు. డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. తల్లిని, భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం. 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ తో మాకు మంచి అనుబంధం ఉంది. చదువుకునే సమయంలో కూడా ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా వ్యవహరించేవాడ”ని భగవాన్ తెలిపారు.

Also Read: బాబోయ్ లారీలు.. హైదరాబాద్- విజయవాడ హైవేపై భయంకర యాక్సిడెంట్లు

డీసీపీ అదిరాజ్ రాణా ఏమన్నారంటే..?
డాక్టర్ శ్రీనివాస్ ‌కుటుంబం చనిపోయినట్లు మాకు సమాచారం వచ్చింది. శ్రీనివాస్ బయట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు ఇంట్లో ఉన్నాయి. వారి మెడపై కత్తితో గాట్లు ఉన్నాయి. డాక్టర్ శ్రీనివాస్ వారిని చంపినట్లు భావిస్తున్నాం. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు. అతనికి అప్పులు బాగా ఉన్నాయని చెబుతున్నారు. క్లూస్ టీం ద్వారా పలు ఆధారాలు సేకరించాం. అప్పులు, ఆస్తులకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులలకు అప్పగించాం. మరింత లోతైన విచారణ చేశాక వివరాలు వెల్లడిస్తాం.

Also Read: దారుణ ఘటన.. భర్త సోదరుడి చేతిలో అత్యాచారంకు గురైన మహిళ.. భర్త ఏం చేశాడంటే!

ట్రెండింగ్ వార్తలు