Kcr : బడే భాయ్, చోటే భాయ్ కలిసి సింగరేణిని ముంచే పనిలో ఉన్నారు- కేసీఆర్

అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.

Kcr : కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రోడ్ షో లో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్, ప్రధాని మోదీపై విరుచుకుడ్డారు. బడే బాయ్ మోదీ, చోటే బాయ్ రేవంత్.. బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు ఇద్దరూ కలిసి సింగరేణిని ముంచే పనిలో ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు.

”కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమూల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, పాలన అందాలని. కొత్తగూడెంలో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజ్ తో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. రైతు బంధు 15వేలు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు నెలకు 2,500.. 2 లక్షల రుణమాఫీ.. ఇలాంటి హామీలు ఇప్పుడు అటకెక్కాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.

పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ గుంపులకు, గిరిజన గూడెలు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్ లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటా భాయ్ రేవంత్ రెడ్డి, బడా భాయ్ నరేంద్ర మోడీ ఉన్నారు” అని కేసీఆర్ అన్నారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుకు బీజేపీ కుట్ర: సీపీఐ నారాయణ

ట్రెండింగ్ వార్తలు