హైదరాబాద్‌లో భారీ వర్షం

  • Publish Date - June 10, 2020 / 12:04 PM IST

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన నగరాన్ని ముంచెత్తింది. బుధవారం(జూన్ 10,2020) సాయంత్రం 5.30గంటలకు వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సడెన్ గా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ వెంటనే వర్షం ప్రారంభమైంది. వాన రాకతో వాతావరణం చల్లబడింది. దీంతో నగరవాసులు కొంత రిలీఫ్ పొందారు. పలు చోట్ల వాన నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

2 రోజులు భారీ వర్షాలు:
రాష్ట్రంలో రెండు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం(జూన్ 10,2020) పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, సిక్కిం, ఒడిశా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని చెప్పింది.

Read: మాస్క్ లా ముఖానికి చుట్టుకున్న స్కార్ప్ ప్రాణం తీసింది

ట్రెండింగ్ వార్తలు