Site icon 10TV Telugu

10వ తరగతి పరీక్షలు.. మాస్కులతో హాజరైన విద్యార్థులు

10th Class Students Attending Exams With Masks, Waterbottels

కరోనా అంటే చాలు ప్రతీఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి ప్రతీచోట వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరిస్తున్నారు.. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేప్పుడు శుభ్రంగా కాళ్లు, చేతులు, ముఖం కడుకుంటున్నారు. అయితే ఈ రోజు (మార్చి 19, 2020)నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావటంతో విద్యార్ధులు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వారిని జాగ్రత్తగా పంపిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు శానిటైజర్లు, నీళ్ల బాటిల్స్‌ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు ఎక్కడ కరోనా సోకుతుందేమో అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారికి పలు సూచనలు చేస్తున్నారు. 

ఇక సెంటర్ల వద్ద మాస్కులతో విద్యార్థులు దర్శనమిస్తున్నారు. కొంతమంది విద్యార్థులైతే తమ చేతులను శుభ్రంగా కడుక్కొని పరీక్షలకు హాజరవుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు అన్ని విధాలుగా విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఇన్విజిలేటర్లు కూడా మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు.(ప్రయాణికులు లేక 168రైళ్లు రద్దు)

Exit mobile version