Anand Mahindra : ఉత్తరకాశీ సొరంగం ఆపరేషన్ సక్సెస్ పై ఆనంద్ మహీంద్రా ఫుల్ హ్యాపీ.. ఏమన్నారంటే..

పలు అంశాలపై స్పందించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సూపర్ సక్సెస్ పై స్పందించారు.

Anand Mahindra..Uttarakhand Tunnel

Anand Mahindra..Uttarakhand Tunnel : 17 రోజులు..41మంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు.వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే యత్నాలు..ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్‌ వద్ద ఉత్కంఠ క్షణాలు. తమవారిని ప్రాణాలతో చూస్తామా..? లేదా అనే భయం..ఆందోళ బాధితుల కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభ..వారు క్షేమంగా రావాలనే మొక్కులు..ఇలా ఉత్తరకాశీ టన్నెల్ యావత్ దేశాన్ని తనవైపుకు తిప్పుకుంది. బాధతులంతా క్షేమంగా తమ కుటుంబాన్ని చేరాలని యావత్ భారతం ఆకాంక్షించింది. ఆ ఆనంద క్షణాలు రానే వచ్చాయి. 17 రోజుల నిర్వరామ కృషికి ఫలితం దక్కింది. దేశీయులతో పాటు విదేశీలు కూడా చేసిన కృషికి ఫలితం దక్కింది. బాధితులంతా మంగళవారం (నవంబర్ 28,20230 రసురక్షితంగా బయటకు వచ్చారు.

ఇక వారి కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు..ఏ క్షణం ఏమాట వినాల్సి వస్తుందోనని ఆందోళన నుంచి బయటపడ్డారు. తమ వారిని చూసిన ఆ క్షణం ముందు..వారికి ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందం వెల్లివిరిసింది. ఇక 17రోజుల పాటు సొరంగంలోనే మానసికంగా..శారీరకంగా ఎంతో బాధను..నరకయాతనను అనుభవించి.. మృత్యుంజయులుగా బయటకు వచ్చిన ఆ క్షణం వారి జీవితాల్లో మర్చిపోలేని క్షణమని చెప్పి తీరాల్సిందే.

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగం ఆపరేషన్ ఎన్నో అవరోధాలను అధిగమించి సూపర్ సక్సెస్ అయి బాధితులంతా సురక్షితంగా రక్షించడాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహేంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏ సొరంగం నుండి అయినా బయటపడటం కష్టమేమీ కాదు” అని అందరికీ గుర్తు చేశారని..వారు ప్రతి భారతీయ పౌరుడి స్ఫూర్తిని పెంచారని పేర్కొన్నారు. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏ క్రీడా విజయం సాధించగలిగే దానికంటే గొప్పగా.., దేశ స్ఫూర్తిని ఇనుమడింప చేశారన్నారు. మా ఆశల్ని ద్విగుణీ కృతం చేశారని ప్రశంసించారు. మన ఆశయం, కృషి కలెక్టివ్‌గా ఉంటే..ఐక్యంగా ఉంటే ఏ సొరంగం నుండి బయటపడటం కష్టమేమీ కాదన్నారు. ఏ పని అసాధ్యం కాదని మరోసారి గుర్తు చేసారు అంటూ పేర్కొన్నారు.

కాగా..టన్నెల్ నుంచి బయటకు వచ్చినవవారిని వెంటనే అత్యవసర వైద్య పరిక్షల కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. 17 రోజుల తరువాత వారు బయటకు సురక్షితంగా రావటంతో ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నెటిజన్లు. కాగా..రెస్క్యూ ఆపరేషన్‌ను విషయంలో అత్యంత శ్రద్ధ వహించి..నిరంతరం పర్యవేక్షించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి సొరంగం నుంచి బైటికి వచ్చిన కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు