శాంసంగ్ నుంచి 600MP కెమెరా సెన్సార్.. మన కంటిచూపు కంటే పవర్‌ఫుల్..!‌‌

  • Publish Date - December 6, 2020 / 02:28 PM IST

Samsung 600MP camera sensor : ప్రముఖ సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ 600MP కెమెరా సెన్సార్‌ను డెవలప్ చేస్తోందంట.. tipster IceUniverse ట్వీట్‌లో ఈ విషయాన్ని రివీల్ చేసింది. శామ్‌సంగ్.. నిజంగానే 600MP సెన్సార్‌లను అభివృద్ధి చేస్తోందని టిప్‌స్టర్ పేర్కొంది.



4K, 8K వీడియో రికార్డింగ్ టెక్నాలజీ కోసం శాంసంగ్ ఈ భారీ కెమెరా సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందంట.. మనిషి కంటి(576MP) కంటే చాలా శక్తివంతమైన కెమెరా సెన్సార్‌ కానుంది. సాధారణంగా మన కళ్లకి కనిపించని వాటిని ఈ కెమెరా సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు.



శాంసంగ్ కెమెరా (Isocell 600MP sensor)పై పని చేయనుంది. వీడియో తీసేటప్పుడు జూమ్ చూస్తే.. 4K, 8K వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందంట.. ప్రస్తుతం శాంసంగ్ భారీ 600MP కెమెరా సెన్సార్ తీసుకొస్తే.. స్మార్ట్ ఫోన్ పై స్పేస్ ఎక్కువ భాగం దీనికే సరిపోయేలా కనిపిస్తోంది.



కెమెరా బంప్ 22mm ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ వెనుక భాగంలో 12 శాతం స్థలాన్ని ఆక్రమించనుంది. ప్రస్తుతానికి ఈ కెమెరా సెన్సార్ డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. భవిష్యత్‌లో ఈ భారీ కెమెరా సెన్సార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై శాంసంగ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు