OnePlus Pad : అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్‌పై అదిరే ఆఫర్లు.. మరెన్నో డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ (12జీబీ, 128జీబీ వేరియంట్) ధర రూ. 33,999 వద్ద లిస్టు అయింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ డివైజ్‌పై రూ. 2వేల కూపన్‌ను అందిస్తోంది.

OnePlus Pad : కొత్త టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో ప్రస్తుతం సమ్మర్ సేల్ కొనసాగుతోంది. వైడ్ రేంజ్ టాబ్లెట్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. అద్భుతమైన ఆఫర్‌లలో వన్‌ప్లస్ ప్యాడ్, అమెజాన్‌లో రూ. 30వేల లోపు అందుబాటులో ఉంది.

Read Also : Apple iPad Air Launch : ఆపిల్ అతిపెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలివే

బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తగ్గింపు ధరకు పొందవచ్చు. అమెజాన్ డివైజ్‌పై రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. టాబ్లెట్ కొన్ని ముఖ్య ఫీచర్లలో 11.6-అంగుళాల డిస్‌ప్లే, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉన్నాయి. మీరు ట్రాక్‌ప్యాడ్‌తో కీబోర్డ్‌ను అదనంగా కొనుగోలు చేయవచ్చు.

ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ (12జీబీ, 128జీబీ వేరియంట్) ధర రూ. 33,999 వద్ద లిస్టు అయింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ డివైజ్‌పై రూ. 2వేల కూపన్‌ను అందిస్తోంది. మీరు బాక్స్‌పై టిక్ చేసి డివైజ్‌పై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. రూ. 3వేల తగ్గింపును పొందవచ్చు.

వన్‌ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ ప్యాడ్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 3.05జీహెచ్‌‌జెడ్ వరకు కార్టెక్స్-ఎక్స్2 కోర్‌ను కలిగిన మొదటి మొబైల్ చిప్. చిప్‌సెట్ 12జీబీ ర్యామ్ కలిగి ఉంది. ర్యామ్-విటా (ర్యామ్ విస్తరణ) టెక్నాలజీకి సపోర్టు ఉంది. టాబ్లెట్ 11.6-అంగుళాల 2.8కె (2800×2000 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేతో 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10 ప్లస్‌తో వస్తుంది. డిస్‌ప్లే డాల్బీ విజన్‌కి సపోర్ట్‌ కలిగి ఉంది. అయితే, స్పీకర్‌లు రిచ్ వ్యూ డాల్బీ అట్మోస్ సపోర్టును అందిస్తాయి. టాబ్లెట్‌లో న్యారో బెజెల్స్, ఎడ్జ్ కర్వ్ ఉన్నాయి. ఐప్యాడ్స్, షావోమీ ప్యాడ్ 5 టాబ్లెట్‌ల మాదిరిగా కాకుండా పదునైన ఎడ్జ్ కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాక్ ప్యానెల్ 13ఎంపీ ప్రైమరీ కెమెరాను టాప్-సెంట్రల్‌గా వస్తుంది. కెమెరా మాడ్యూల్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ స్టయిలో మాగ్నెటిక్ కీబోర్డ్ సపోర్టు ఇస్తుంది. టాబ్లెట్ 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ టెక్‌తో 9,500ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. దిగువన ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ కూడా ఉంది. చివరగా, కస్టమర్లు భారత మార్కెట్లో ప్యాడ్ హాలో గ్రీన్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ధర వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. గత ఏప్రిల్‌ నుంచే టాబ్లెట్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటుంది.

Read Also : iPad Air Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐప్యాడ్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.9,901 మాత్రమే!

ట్రెండింగ్ వార్తలు