Apple iPad Air Launch : ఆపిల్ అతిపెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలివే

Apple iPad Air Launch : ఎమ్2 చిప్‌సెట్‌తో ఆధారితమైన 12.9-అంగుళాల డిస్‌ప్లేతో పెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ను లాంచ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐప్యాడ్ స్లిమ్ బాడీ, ఆల్-స్క్రీన్ డిజైన్‌తో ప్రస్తుత జనరేషన్‌కు సమానమైన డిజైన్‌తో రానుంది.

Apple iPad Air Launch : ఆపిల్ అతిపెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలివే

Apple could launch its biggest iPad Air with 12.9-inch display soon

Apple iPad Air Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ 6వ జనరేషన్ మోడల్‌గా 12.9-అంగుళాల డిస్‌ప్లేతో కూడిన పెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. దీనిపై ఆపిల్ కసరత్తు చేస్తోంది. ఆపిల్ యాజమాన్య ఎమ్2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. కొత్త ఐప్యాడ్ గురించి గత ఏడాది అక్టోబర్ నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నివేదిక ప్రకారం.. రాబోయే డివైజ్ రెండర్‌లను వెల్లడించింది. కొత్త ఐప్యాడ్ ఎయిర్ 12.9 అంగుళాలు ప్రస్తుత జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్‌కు స్లిమ్ బాడీ ఆల్-స్క్రీన్ డిజైన్‌తో సమానమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి.

Read Also : Realme 12 Pro 5G Series : రియల్‌మి 12ప్రో 5జీ సిరీస్ లాంచ్ డేట్ ఇదే.. ముందుగా రెండు మోడళ్లు.. స్పెషిఫికేషన్లు ఇవేనా?

బ్యాక్ కెమెరా చుట్టూ డిజైన్ మార్పు : 
ఆపిల్ లేటెస్ట్ టాబ్లెట్‌లో పైన టచ్ ఐడీ బటన్, గత జనరేషన్ మాదిరిగానే దిగువన స్పీకర్ గ్రిల్‌లు ఉంటాయి. ఇంకా, కొత్త ఐప్యాడ్ ఎయిర్ సైడ్ స్విచ్, యూఎస్‌బీ-సి టైప్ పోర్ట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆసక్తికరంగా, కొత్త ఐప్యాడ్ ఎయిర్‌లో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ చుట్టూ కనిపించే బార్డర్ ఉందని నివేదిక సూచిస్తోంది. బ్యాక్ కెమెరా చుట్టూ డిజైన్ మార్పు ఉంది.

ఇది కాకుండా, ఆపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్‌తో డిజైన్‌లో చాలా మార్పులు చేస్తున్నట్లు కనిపించడం లేదు. నివేదిక ప్రకారం.. రాబోయే ఐప్యాడ్ ఎయిర్ 12.9 అంగుళాల ప్రో, ఎయిర్ లైనప్ మధ్య వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. యూజర్లకు ఆపిల్ నుంచి పెద్ద డిస్‌ప్లేను పొందే అవకాశాన్ని అందిస్తుంది.

Apple could launch its biggest iPad Air with 12.9-inch display soon

Apple iPad Air display

రెండు సైజుల్లో రానున్న కొత్త ఐప్యాడ్ :
అంతేకాకుండా, ఐప్యాడ్ ఎయిర్ 12.9 అంగుళాల చుట్టూ బెజెల్‌లు గత జనరేషన్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో లైనప్ కన్నా పెద్ద కొలతలు కలిగి ఉంటుంది. ప్రస్తుత ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ 10.9-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. అయితే, ఆపిల్ ఈ ఏడాది తర్వాత కొత్త ఐప్యాడ్ లాంచ్‌తో రెండు సైజుల్లో అందించనుంది.

J507, J508, J537, J538 కోడ్‌నేమ్‌లతో కూడిన 4 సరికొత్త మోడల్‌లతో 12.9-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్‌ను లాంచ్ చేయాలని ఆపిల్ యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ మోడల్‌లు వై-ఫై, సెల్యులార్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంటాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో సిరీస్‌లతో ఐప్యాడ్ ఎయిర్ సిరీస్‌లో పెద్ద డిస్‌ప్లే వివిధ ధరల వద్ద మరిన్ని ఆప్షన్లతో అందించాలని ఆపిల్ భావిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.

Read Also : Samsung Galaxy Watch Series : శాంసంగ్ గెలాక్సీ కొత్త సిరీస్ వాచ్‌లివే.. బీపీ, ఈసీజీ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు!